మీరు వినే ఉండని కూరగాయ టిండా.. వేసవిలో షుగర్ పేషేంట్స్‌కు పర్ఫెక్ట్ ఫుడ్

-

మనం ఎప్పుడూ తినే కూరగాయలు తప్ప మనకు కొత్త వాటిపై పెద్దగా అవగాహన ఉండదు. అదే వంకాయ, టమాటా, దోసకాయ, సొరకాయ, బీరకాయ, ములక్కాయ, ఫ్లవర్ ఇంకా ఆకుకూరలు.. వారానికోసారి పప్పు.. దాదాపు అందరి ఇళ్లలో ఇవే తిప్పి తిప్పి వండుతూ ఉంటారు. వీకెండ్ లో నాన్ వెజ్. కానీ మనకు తెలియని, మనం తినని కూరగాయలు చాలా ఉన్నాయి.

ఉంటే ఉండని మనకెందుకు అనుకుంటున్నారేమో.. అవి తింటే బోలెడు లాభాలున్నాయండీ.. అది మ్యాటర్.. మీరు ఎప్పుడైనా.. టిండా కూరగాయ గురించి విన్నారా.. దీన్నే.. దిల్ పసంద్(Dil pasand),టిండా, ఇండియన్ బేబీ పంప్కిన్ (Indina Baby Pumpkin) అని కూడా అంటారు. ఇది షుగర్ పేషేంట్స్ పాలిట నెంబర్ వన్ కూరగాయ. వేసవిలో సాగు చేసే కూరగాయ ఈ టిండా. ఈరోజు మనం ఈ కూరగాయ సాగుకు అనుకులమైన నేలలు, సమయం..టిండా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం.

దిల్ పసంద్ (టిండా) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

టిండాలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, ఉబ్బరం, కడుపు తిమ్మిరిని నివారిస్తుంది. ఇందులో ఉండే లాక్సిటివ్‌లు ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించి, పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది.

టిండాలో పాలీఫెనాల్ , కుకుర్బిటాసిన్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ , క్యాన్సర్ కలిగించే టాక్సిన్స్ నుండి ఇవి రక్షిస్తాయి.

టిండాలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె కండరాల పనితీరు సరైన విధంగా ఉండేలా చూస్తుంది.. అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు టిండాను వారి రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే హార్ట్ హెల్త్ కు బాగుంటుంది.

టిండాలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. ఇందులో కెరోటినాయిడ్స్ యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమోతాదులో ఉంటాయి. లుటీన్, జియాక్సంతిన్, ఇవి రెటీనాలో కీలకమైన భాగాలు.. సున్నితమైన కంటి అవయవాలను రక్షిస్తాయి.

టిండాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇందులో నీటి కంటెంట్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తినాలనే కోరికను నియంత్రిస్తుందట. కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు ఈజీగా తగ్గేయొచ్చు.

టిండా సాగుకు అనుకూలమైన నేలలు.. సమయం

రైతులు మేలైన టిండా విత్తడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. వేడి , తేమతో కూడిన వాతావరణం టిండా సాగుకు అనుకూలం. అందుకనే వేసవిలో మాత్రమే దీనిని సాగు చేస్తారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్ని రకాల మట్టిలో ఇది పండిచవచ్చు. అయితే మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన తేలికపాటి నేల టిండా సాగుకు మంచి ఎంపిక.

టిండాను ఏడాదికి రెండు సార్లు సాగు చేసుకోవచ్చు. ఫిబ్రవరి నుండి మార్చి వరకు , జూన్ నుండి జూలై వరకూ దీని సాగుకు అనుకూలం. దిగుబడి కోసం మేలైన రకాల టిండా విత్తనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. టిండా పంట సాధారణంగా రెండు నెలల్లో పక్వానికి సిద్ధంగా ఉంటుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news