పాలిచ్చే భంగిమల్లో రకాలు !

-

మొదటిసారి డెలివరీ ఏ తల్లికైనా బేబీకి పాలు ఎలా ఇవ్వాలో అవగాహన ఉండదు. ఎలా పడితే అలా పసిబిడ్డకు పాలు ఇవ్వడం వల్ల పాపాయికి ఆటంకం కలుగుతుంది. మరి ఒళ్ళో పడుకోబట్టుకొని వంగి ఇవ్వాలా.. పక్కన పడుకోబెట్టుకొని ఇవ్వాలా.. ఇలా బోలెడు సందేహాలతో ఆ తల్లి సతమతమవుతుంటుంది. వాటికి పరిష్కారమే ఇది.

పాలిచ్చే భంగిమల్లో పద్ధతులు

క్రెడిల్ భంగిమం : ఏ వైపు రొమ్ము నుంచి పాలిస్తుంటే ఆ పక్క మోచేతిమీద పాపాయి తలని ఆనించి పట్టుకోవాలి. ఇది సాధారణంగా ఎక్కువమంది పిల్లలకు పాలు పట్టించే విధానం. ఇది మీ ఇద్దరికీ సౌకర్యంగానే ఉంటుంది.

క్రాస్ క్రెడిల్ : సాధారణ ప్రసవమైతే ఒళ్లో పడుకోబెట్టుకొని బిడ్డ తలను లేపి రొమ్ముకి ఆనించి పాలు పట్టాలి. మొదటి ఐదారు నెలల వరకూ ఈ విధానం సౌకర్యంగానే ఉంటుంది.
లెయిడ్ బ్యాక్ పొజిషన్ : దీన్నే బయలాజికల్ నర్చరింగ్ విధానం అంటారు. ఈ పద్ధతిలో పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అంతే సౌకర్యంగా ఉంటారు. వెన్నుకి తలగడ ఆధారం చేసుకొని ఏటవాలుగా పడుకొని పాలు పట్టించవచ్చు.

ఫుడ్‌బాల్ హోల్డ్ : సిజేరియన్ అయిన తల్లులు ఫుడ్‌బాల్ పొజిషన్ అనుసరించవచ్చు. ఈ భంగిమలో తల్లి దిండుకు ఆనుకొని కూర్చుని బిడ్డ తలను చేత్తో పట్టుకొని పాలు పట్టించవచ్చు. దీనివల్ల బిడ్డ బరువు తల్లి పొట్ట మీద పడకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news