చర్మం ముడతలు రాకుండా ఉండేందుకు క్యారెట్ ఆయిల్.. సైంటిఫిక్ గా తేలిన నిజం..! 

చర్మం ముడతలు పడటం అనేది ముసలితనానికి లక్షణం. ముడతలు రాకుండా, స్కిన్ మంచి టైట్ గ్లోతో ఉండాలనే అందరూ కోరుకుంటారు. మొఖం పై కానీ, మెడభాగంలో కానీ ముడతలు రావటం మొదలైనప్పుడు అందరికీ ఒక నెగిటివ్ ఫీల్ ఏర్పడుతుంది. ఏవేవో క్రీమ్స్ వాడటం స్టాట్ చేస్తారు. ఈరోజు మనం ముడతలు రావడానికి కారణం ఏంటి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

ముడతలు రావడానికి కారణం ఏంటి?

ముడతలు వచ్చినప్పుడు చర్మం లోపల పొరలో ఒక మెష్ ఉంటుంది..దాన్నే కొలాజెన్ ఎలాస్టిన్ అంటారు. ఇది చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది. ఎప్పుడైతే ఈ బ్యాండ్స్ దెబ్బతింటాయో.. స్కిన్ ముడతలు వస్తుంది. స్కిన్ దెబ్బతినడానికి ప్రధాన కారణం..ఎండలో ఉండే యూవీరేసెస్ డామేజ్ వల్ల కూడా స్కిన్ డీ హైడ్రేట్ అవుతుంది. అప్పుడు ఈ బ్యాండ్స్ తెగిపోతాయి.

ముడతలు రాకుండా ఉండాలంటే.. ఏం చేయాలి.?

క్యారెట్ ఆయిల్ ముడతలు రాకుండా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్ ఇది అందుబాటులో ఉంది. చర్మ సౌందర్యానికి విటమిన్ A ,E బాగా అవసరం. ఇవి రెండు చర్మానికి అందితే.. స్కిన్ మంచి గ్లో ఉంటుంది. క్యారెట్ ఆయిల్ 1ML తీసుకుని 5ML కోకోనట్ ఆయిల్ తీసుకుని స్నానానికి ముందు బాడీకీ రాసుకుని మర్దనా చేసుకుంటే చాలు. చర్మం లోపల మెష్ డీహైడ్రేట్ అవకుండా పనికొస్తుందని.. 2015వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ క్వైంబ్రా- ( Univeristy Of Coimbra- Portugal) వారు పరిశోధన చేసి ఇచ్చారు.

ఇంట్లోనే క్యారెట్ ఆయిల్ ఎలా చేయాలంటే..

క్యారెట్ తురుము తీసుకుని.. దానికి డబుల్ కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి తీసుకుని.. ఆ ఆయిల్ లో క్యారెట్ తురుము వేసుకుని పొయ్యిమీద పెట్టి మరిగించండి. 10-15నిమిషాలు మరిగే సరికి క్యారెట్ లో ఉండే మెడిసినల్ ప్రోపర్టీస్ అన్నీ ఆయిల్ లోకి వచ్చేస్తాయి. తర్వాత ఫిల్టర్ చేయండి. ఈ ఆయిల్ ను చర్మానికి అప్లై చేసుకోవచ్చు.

క్యారెట్ ఆయిల్ వాడటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి.?

క్యారెట్ ఆయిల్ లో ఉండే ( Caramel acetate, Alfa fine) అనే కెమిల్స్.. యూవీరేస్ నుంచి చర్మాన్ని రక్షిస్తున్నాయని పరిశోధనలో పేర్కొన్నారు. కొందరికి జిడ్డు చర్మం ఉంటుంది. ఆయిల్ స్కిన్ తగ్గించుకోవడానికి కూడా క్యారెట్ ఆయిల్ అప్లై చేస్తే.. అధికంగా జిడ్డు కారడాన్ని కూడా నిర్మూలిస్తుందట.
చర్మవ్యాధలతో బాధపడేవారు.. సోరియాసిస్, ఎగ్జిమా, తామర లాంటి సమస్యలతో బాధపడేవారు, ఎలర్జీలు వచ్చినవారు కూడా.. క్యారెట్ ఆయిల్ అప్లై చేస్తే చర్మకణాలు డామేజ్ అవకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా ఉపయోగపడతున్నాయట.
హెయిర్ కి కూడా క్యారెట్, కొబ్బరినూనె కలిపి రాసుకుంటే.. చుండ్రు రాకుండా, హెయిర్ డ్రైనెస్ రాకుండా తగ్గించడానికి క్యారెట్ ఆయిల్లో ఉండే కెరిటినాయిడ్స్, ఇతర కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయట.
క్యారెట్ ను జ్యూసుల్లో వాడుకోవడం, కూరలు చేసుకుని తినటంతో పాటు.. ఆయిల్ ను ఈ రకంగా వాడుకుంటే.. చర్మసౌందర్యానికి ఎంతో మంచి జరుగుతుంది.
-Triveni Buskarowthu