గంజాయి నూనెతో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు చెక్.. ఓ మహిళకు తగ్గిందట.. కానీ

-

గంజాయి…ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఎక్కడ గంజాయి పట్టుకున్న దానికి మూలం ఆంధ్రానే అంటున్నాయి ప్రతిపక్షాలు. గంజాయి గురించి నెగిటివ్ గానే విన్నాంకాని.. గంజాయితో కూడా ఆరోగ్యానికి మంచి జరుగుతుందట. గంజాయి నూనెతో ఊపిరితిత్తుల క్యాన్సర్ తగ్గుతుందట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

80 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ క్యాన్సర్‌కు గంజాయి నూనెతో చికిత్స తీసుకుంటూ సత్ఫలితాలు పొందినట్లు వార్తలు వస్తున్నాయి. వైద్యుల చికిత్సను పక్కనపెట్టి గంజాయి నూనెతో ఆమె స్వీయ వైద్యాన్ని అవలంభిస్తోందట. ఈ రిపోర్టును బీఎంజే కేస్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించారు. దీని ఆధారంగా గంజాయి నూనె ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సరైన మందులా పనిచేస్తుందని కొందరు భావిస్తున్నారు.

2018లో యూకేలోని వాట్ ఫోర్ట్ జనరల్ ఆసుపత్రిలో ఒక లంగ్ క్యాన్సర్ బాధితురాలికి చికిత్స అందించారు శ్వాసకోశ విభాగం వైద్యులు. ఆమె ఊపిరితిత్తుల్లో 41 మిల్లిమీటర్ల పరిమాణంలో కణితి ఉంది. ధూమపానం కారణంగా ఆమె క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD), ఆస్టియో ఆర్థరైటిస్, అధిక రక్తపోటు లాంటి అనారోగ్యాల బారిన పడిందట. వీటికి చికిత్స కోసం వివిధ రకాల మెడికేషన్ ఫాలో అయింది. అయితే ఆమెకు శస్త్రచికిత్స, కీమోథెరపీ లాంటి సంప్రదాయ చికిత్స నిర్వహించవచ్చని వైద్యులు భావించారు. కానీ ఆమె ఆ చికిత్సను తిరస్కరించింది.

cannabis oils

అందుకు బదులుగా 0.5 మిల్లీ లీటర్ల కనాబానాయిడ్స్ ఆయిల్ అంటే CBD- గంజాయి నూనెను ఉపయోగించడం ప్రారంభించింది. బంధువుల సలహా మేరకు 2018 ఆగస్టు నుంచి రోజుకు మూడు లేదా రెండు సార్లు తీసుకుంటూ వచ్చింది.. 2021 ఫిబ్రవరి నాటికి ఆమె కణితి క్రమంగా 41 మిల్లిమీటర్ల నుంచి 10 మిల్లీ మీటర్లకు తగ్గిపోయింది. ప్రతి 3 నుంచి 6 నెలలకు రెగ్యులర్ సీటీ స్కాన్ చేయించుకుంటూ వచ్చింది. మొత్తంగా చూస్తే నెలకు 2.4 శాతం చొప్పున కణితి పరిమాణం 76 శాతం తగ్గింది. ఈ నూనె తీసుకున్నప్పుడు వేడిగా ఉండే ఆహారపానీయాలకు దూరంగా ఉండాలని గంజాయి నూనె సరఫరాదారు సూచించారని, లేకుంటే నూనె రాయి మాదిరిగా కఠినంగా ఉంటుందని తెలిపారని ఆమె వైద్యులకు చెప్పింది.

ఆ నూనె తీసుకున్నప్పటి నుంచి తనకు ఆకలి కూడా తగ్గిందని, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని మహిళ బదులిచ్చింది. అంతేకాకుండా మందులు, ఆహారశైలి కూడా ఎలాంటి మార్పులు లేవు. అంతేకాకుండా ధూమాపానం కూడా కొనసాగించినట్లు చెప్పింది. అయితే ఇది ఒక్క కేసు రిపోర్ట్ మాత్రమే. మరో కేసులో ఎలా ఉందనేదానిపై స్పష్టత లేదు. అసలు ఈ నూనెలో ఏం ఉపయోగకరమైన పదార్థాలు ఉన్నాయో కూడా వైద్యులు ఇంకా చెప్పలేదు.

సీబీడీ అంటే ఏంటి?

సీబీడీ అనేది గంజాయి ఆకు లేదా గంజాయి మొక్క. CBD క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను, క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన దుష్ప్రభావాలను, వికారం, వాంతులు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని గతంలో చేసిన పరిశోధనల్లో తేలింది. అయితే వివిధ రకాల వ్యాధులకు చికిత్సల్లో దీని వినియోగంపై ఆరోగ్య సంస్థలు ఇంకా అధికారికంగా సూచనలు ఇవ్వట్లేదు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news