పల్లీలతో ఈ సమస్యలకి చెక్ పెట్టేయండి..!

-

వేరుశెనగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒబేసిటీ సమస్యని కూడా ఇది తగ్గిస్తుంది. అలానే వేరుశనగ వల్ల చర్మానికి మరియు జుట్టుకి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజు వేరుశనగ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది చూద్దాం.

 

బరువు తగ్గొచ్చు:

ఒబెసిటి సమస్యని ఇది తగ్గిస్తుంది. అలానే బరువు కూడా తగ్గవచ్చు. రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్స్ పల్లీలు తినడం వల్ల బరువు తగ్గడానికి అవుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటే మంచిది:

వేరుశనగ ని ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఫెర్టిలిటీని అది పెంచుతుంది. అలాగే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి పల్లీలను నీళ్ళల్లో నానబెట్టుకుని గర్భిణిలు తింటే మంచిది.

యాంటీ ఏజింగ్ గుణాలు:

పల్లీల నూనె మీ చర్మానికి అప్లై చేసుకోవడం వల్ల ముడతలు తగ్గుతాయి. అలాగే చర్మం ఎంతో బాగుంటుంది. దీని కోసం మీరు పల్లీల నూనెలో కొద్దిగా నిమ్మ రసం వేసుకొని ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత ముఖాన్ని కడిగేసుకుంటే మీ ముఖం అందంగా మారుతుంది.

జుట్టు కి మంచిది:

పల్లీలు నూనె జుట్టు కి ఎంతో మేలు చేస్తుంది. చుండ్రుని కూడా ఇది తగ్గిస్తుంది. కొద్దిగా నీళ్లని నూనెలో వేసుకుని కలుపుకుని వారానికి మూడు సార్లు తలకు పట్టిస్తే జుట్టు కి మంచిది.ఇలా ఈ సమస్యలు పల్లీలతో తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలను మనం ఈజీగా దీనితో పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news