వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో సమస్యలను తరిమికొట్టడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మెదడు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కార్డియాక్ హెల్త్, బరువు తగ్గడానికి, గట్ హెల్త్ కి బాగా సహాయం చేస్తాయి.
ఒక ఔన్స్ వాల్ నట్స్ లో నాలుగు గ్రాముల ప్రోటీన్, రెండు గ్రాముల ఫైబర్, అధిక శాతం మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు జింక్ ఉంటాయి. అలాగే విటమిన్ బి, విటమిన్ ఈ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు కూడా వాల్ నట్స్ ద్వారా మనం పొందొచ్చు. అయితే వాల్ నట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం:
గుండె ఆరోగ్యానికి వాల్ నట్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఒమెగా త్రీ సమృద్ధిగా ఉంటుంది అయితే వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
బరువు తగ్గొచ్చు:
వాల్ నట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
ప్రోటీన్ మొదలు ఫైబర్ వరకు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో మేలు చేస్తాయి.
యాంటీ ఏజింగ్ గుణాలు:
వాల్ నట్స్ లో యాంటీఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి. ఇది ముసలితనం త్వరగా రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది ఇలా ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వాల్ నట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. దీనిలో ఉండే ప్రోటీన్స్ మరియు ఫైబర్ గర్భిణీలఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. చూశారు కదా వాల్ నట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కాబట్టి రెగ్యులర్ గా వాల్ నట్స్ ని తీసుకోండి దీంతో ఈ సమస్యల నుంచి మీరు దూరంగా ఉండొచ్చు.