కాఫీతో కొవిడ్‌ టెస్ట్‌ చేయొచ్చు..ఎలాగో తెలుసా..!

-

కాఫీ అంటే ఇష్టపడని వాళ్లు చాలా రేర్‌గా ఉంటారు కదా..కాఫీ తాగే ప్రతిఒక్కరికి ఆ స్మెల్‌ ఆస్వాదించటం కూడా బాగా అలవాటుగానే ఉంటుంది. ఈవినింగ్స్‌ ప్రశాంతగా అలా ఛైర్‌లో కుర్చుని మాంచి స్ట్రాంగ్‌ కాఫీ తాగుతూ ఆ వాసన పీలుస్తూ కాఫీ ప్రియులు భలే ఎంజాయ్‌ చేస్తారు. తలనొప్పి, అలసట ఇట్టే ఎగిరిపోతాయ్‌ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు భీభత్సం సృష్టిస్తున్న కరోనా వైరస్‌కి కాఫీకి సంబంధం ఉందని అధ్యయానాల్లో తేలింది. భయపడకండి..సంబంధం అంటే..కాఫీతాగితే వైరస్‌ వస్తుందనే యాంగిల్‌ కాదు.

coffee

సాధారణంగా కరోన వైరస్‌ సోకిన వారికి అది వచ్చిందన్న విషయం గ్రహించటానికే రెండుమూడు రోజులు పైనే పడుతుంది. బేసిక్‌ లక్షణాలైనా వాసనకోల్పోవటం, రుచితెలయకపోవటం ఉన్నప్పటికి..వచ్చినవారికి ఇవి కూడా తెలియటం లేదు. రుచి తెలుస్తుంది. వాసన అంటే..మనం దానిపైనా దృష్టిపెట్టలేం కదా..ఘాటైన వాసనలు గ్రహించగలుగుతున్నారు. ఈ క్రమంలోనే వైరస్‌ సోకిన వారు కూడా తమకు తెలియకుండానే ఈ వైరస్‌ను పక్కనవారికి వ్యాపిస్తున్నారు. కాబట్టి కాఫీతో కరోనా వైరస్‌ ఉందో లేదో తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కాఫీ పరిమళాన్ని, రుచిని ఆశ్వాదిస్తూ తాగడం మనలోచాలా మందికి అలవాటే. కరోనాను పసిగట్టంలో కూడా ఇదే టెక్నిక్‌ ఉపయోగపడుతుంది. ఎప్పటిలా కాఫీ నుంచి వచ్చే కమ్మని పరిమళం మీ ముక్కును తాకడంలో ఏదైనా ఇబ్బంది కలిగినా.. లేక రుచిని తెలుసుకోలేకపోయినా వెంటనే అనుమానించవల్సిందే. కోవిడ్‌ను పసిగట్టడానికి పరిశోధకులు కాఫీనే ఎక్కువగా వాడుతున్నారట కూడా. వాసన చూడలేకపోయినవారిని పరీక్షిస్తే, వారిలో కోవిడ్‌ బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మీకెప్పుడైనా కోవిడ్‌ గురించిన బెంగ పట్టుకుంటే వెంటనే ఈ కాఫీ టెస్ట్‌ చేసుకుంటే..సరిపోతుంది.

కొన్నిసార్లు కొవిడ్‌ లక్షణాలు ఉన్నా స్వాబ్‌ టెస్టుల్లో నెగిటివ్‌ వస్తుంది. ఇలాంటి సంఘటనలో మీ సర్కిల్లో కూడా ఎవరోఒకరి విషయంలో జరిగే ఉంటాయి. వాటికి కారణాలు ఏంటంటే.

సరైన స్వాబ్‌ను వాడకపోవడం.
శాంపిల్ సరిపడనంత రాకపోవడం
శాంపిల్‌ను సేకరించాక దానిని సరైన రీతిలో భద్రపరచకపోవడం
శాంపిళ్లను సరైన రీతిలో ల్యాబ్‌కు చేర్చకపోవడం

కోవిడ్-19 ఒక రకమైన రైబో న్యూక్లియిక్ యాసిడ్ (ఆర్‌ఎన్‌ఏ) వైరస్. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే దాని గుణాలు త్వరగా మారిపోతాయి. వేడికి మరింత త్వరగా మారిపోతుంది. కాబట్టి, సరైన వాతావరణ పరిస్థితుల్లో వీటిని ల్యాబ్‌కు చేర్చకపోతే పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది” అని వైద్యులు అంటున్నారు.
స్వాబ్ టెస్టులు చేసే వారికి సరైన శిక్షణ లేకపోవడం కూడా ఇలా ఫాల్స్ నెగెటివ్ ఫలితాలు రావడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికి మీకు అనుమానం ఉంటే..ఈ పరీక్షల కంటే ముందు కాఫీ టెస్ట్‌ చేసుుకుని ఒక నిర్దారణకు వచ్చాక అప్పుడే స్వాబ్‌ టెస్టులకు వెళ్లటం మంచిది. చిన్న చిన్నఅనుమానంతో అనవసరంగా టెస్ట్‌ సెంటర్లుకు వెళ్తే.. లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నవాళ్లం అవుతాం.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news