భారతీయ వంటకాల్లో ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో లవంగం ఒకటి. ఇందులో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి.ముఖ్యంగా లవంగాల్లో ‘నైజీరిసిన్’ ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
- కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
- అలాగే ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత 2–3 లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
- లవంగాలతో నోటి దుర్వాసనను తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది.
- వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి కొవ్వు పెరిగిపోతుందని భయపడకుండా ఈ చిట్కా పాటించండి.
- వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.
- జలుబు, దగ్గుకు లవంగం మంచి మందు. నోట్లో ఒ రెండు లవంగాలు వేసుకొని చప్పరిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు ఉపయోగపడతాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు ముఖ్యంగా..
రోజూ కిచెన్ లోకి వెళ్లినప్పుడు ఓ రెండు లవంగాలు తీసుకుని అలా నోట్లో వేసుకోండి. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మీరు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇది ఎంతో లాభదాయకం కూడా. ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరం నుండి అవాంఛిత కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది.