ఈ ఐదు పద్దతులతో డయాబెటిస్ ని అదుపులో ఉంచచ్చు..!

-

డయాబెటిస్ ను సహజంగా నయం చేయడానికి కొన్ని మెడికేషన్ ను పాటిస్తే అది కంట్రోల్ లో ఉంటుంది. అయితే ప్రతిరోజు కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించినా సరే కొంతవరకు డయాబెటిస్ ను సహజంగా నియంత్రించవచ్చు.

 

కాపర్ వాటర్ ను తాగండి:

రాత్రి రాగి పాత్రలో మంచినీరు పోసి ఉంచండి. ఇలా చేయడం వల్ల కాపర్ పార్టికల్స్ తో మంచినీరు చార్జ్ అవుతుంది. ఈ మంచినీరును ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి కొన్ని పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కు సంబంధించిన గుణాలు చెందుతాయి.

మెంతులు:

రక్తంలో షుగర్ శాతంను తగ్గించుకోవడానికి ఇదే మంచి చిట్కా. మెంతులులో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది దాని వల్ల రక్తం షుగర్ ను అబ్జార్బ్ చేసుకోవడం తగ్గుతుంది. ప్రతి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల మెంతులు తినడం వల్ల డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

వ్యాయామాలు:

వ్యాయామం చేసి బరువు తగ్గించుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుకోవచ్చు. ఈ విధంగా చేస్తే కచ్చితంగా డయాబెటిస్ కంట్రోల్లోనే ఉంటుంది. మీరు వ్యాయామాలు ఇప్పుడే మొదలు పెట్టాలి అనుకుంటే ముందుగా ఏరోబిక్స్, యోగా వంటివి ప్రయత్నించండి.

జీవన విధానం:

మంచి జీవన విధానాన్ని పాటించడం వలన కూడా ఆరోగ్యం బాగుంటుంది. రోజూ ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం, నీళ్లు ఎక్కువ తాగడం, షుగర్ లెవెల్స్ ని రెగ్యులర్ గా చెక్ చేయించుకోవడం ముఖ్యం.

లో కార్బో డైట్స్:

జీర్ణప్రక్రియలో కార్బోహైడ్రేట్స్ షుగర్ కింద మారుతాయి. ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అప్పుడు షుగర్ శాతం ఎక్కువ అవుతుంది. కాబట్టి రైస్, బంగాళదుంప, బ్రెడ్ వంటివి తినడం తగ్గించండి. వీటికి బదులుగా ప్రోటీన్ మరియు ఫ్యాట్ తీసుకోండి. మీ బ్లడ్ షుగర్ మీరు తీసుకొనే డైట్ బట్టి ఉంటుంది అని గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news