ఈ చెడు అలవాట్ల వల్లనే సయాటికా వస్తుందని మీకు తెలుసా..?

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో సయాటికా కూడా ఒకటి. సయాటికా వల్ల నడుము నొప్పి పెట్టడం, కాళ్లు లాగడం ఇలా చాలా సమస్యలు వస్తాయి.

పైగా సయాటిక ఒకసారి వస్తే నిజంగా పోవడం కష్టమే. అయితే సయాటికా ఎందుకు వస్తుంది..?, దానికి గల కారణాలు ఏమిటి అనేది చూద్దాం. ఈ చెడు అలవాట్లు వల్ల సయాటికా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి అవేంటో చూద్దాం.

సరైన జీవన విధానం లేకపోవడం:

సరైన జీవన విధానం లేకపోవడం వల్ల సయాటికా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సేపు ఒకటే చోటులో కూర్చోవడం, ఒకే పొజిషన్ లో ఉండిపోవడం లాంటివి చేయడం వల్ల సయాటికా నరం మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది. దీనితో ఇబ్బంది వస్తుంది.

బ్యాక్ పాకెట్ లో బరువు పెట్టడం:

చాలామంది బ్యాక్ పాకెట్ లో ఎక్కువ బరువును పెడుతూ ఉంటారు దీని వల్ల కూడా సయాటిక వచ్చే అవకాశం ఉంది. ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.

భుజాలతో ఎక్కువ బరువు మోయడం:

బాగా బరువు ఉండే బ్యాగులను మోయడం లాంటివి చేయడం వల్ల కూడా సయాటిక వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అలవాట్లను కూడా మార్చుకోండి.

సరైన ఫుట్వేర్ లేకపోవడం:

వేసుకునే పాదరక్షల బట్టి కూడా బట్టి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వేసుకునే ఫుట్వేర్ పై కూడా దృష్టి పెట్టండి. అలానే బాగా టైట్ గా ఉండే జీన్స్ వేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చెడు అలవాట్లు లేకుండా ఉంటే సయాటికా సమస్య రాదు.