వెన్నునొప్పి వల్ల కూర్చోవడం, నిలబడడం కష్టంగా మారిందా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి.

-

కరోనా కారణంగా ఎక్కువ శాతం జనాలు ఇళ్ళలో నుండే పని చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు. ఈ కారణంగా వెన్నునొప్పి సమస్యలు వస్తున్నాయి. వెన్ను నొప్పి అన్ని వయసుల వారికి వచ్చే సమస్య. ఎక్కువగా నిల్చోవడం, కూర్చోవడం, వర్కౌట్స్ ఎక్కువగా చేయడం మొదలగు కారణాల వల్ల ఇది ఉత్పన్నమవుతుంది. వెన్ను నొప్పి వచ్చినపుడూ కూర్చోవడం, నిలబడడం కష్టంగా మారుతుంది. అలాంటప్పుడు ఇంటి నివారణలు పాటిస్తే చక్కటి ఉపశమనం లభిస్తుంది.

ఆ ఇంటినివారణలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వెల్లుల్లి

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పాల్సిన పనిలేదు. దీన్ని తీసుకుని ఆవనూనెలో వేయించి వడపోసి, ఆ నూనెతో మసాజ్ చేసుకోండి. మంచి ఉపశమనం లభిస్తుంది.

పసుపు

శరీరంలో ఎలాంటి నొప్పి ఉన్నా దాన్ని తగ్గించగలిగే శక్తి పసుపుకి ఉంది. నడుము నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు పాలల్లో పసుపు కలిపి తీసుకోండి. బాగా పనిచేస్తుంది.

రాక్ ఉప్పు

రాక్ ఉప్పుని తీసుకుని నీటిలో కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేయండి. ఆ పేస్టుని నడుము మీద మర్దన చేయండి. అంతే కొద్ది క్షణాల్లో నొప్పి నుండి నివారణ లభిస్తుంది.

మెంతులు

మెంతులు చాలా రకాల నొప్పులని మాయం చేస్తాయి. నడుము నొప్పి నుండి ఉపశమనం ఇవ్వడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనికోసం మెంతుల పొడిని పాలల్లో కలుపుకోండి. అందులో కొద్దిగా తేనె కూడా వేయండి. ఈ ఔషధాన్ని తాగితే నడుము నొప్పి నుండి నివారణ లభిస్తుంది.

అల్లం

అల్లం ఎన్నో ఔషధ పోషాకలను కలిగి ఉంటుంది. జలుబు, దగ్గును నివారించడంలోనే కాదు నడుము నొప్పిని దూరం చేయడంలో ఇది బాగా సాయపడుతుంది. దీనికోసం ఒక కప్పు నీటిలో అల్లం వేసి 15నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత దానికి తేనె కలపండి. ఈ మిశ్రమం నడుము నొప్పినే కాదు జలుబు, దగ్గు, గొంతునొప్పిని కూడా దూరం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news