వాక్సిన్ కొరత, డైరెక్ట్ గా కంపెనీలతో టచ్ లోకి వెళ్ళిన తెలంగాణా ప్రభుత్వం

-

తెలంగాణాలో కరోనా వాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. కరోనా కట్టడికి చర్యలతో పాటుగా వాక్సిన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీకి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, ఇతర ప్రతినిధులు, అధికారులు హాజరు అయ్యారు. వాక్సిన్ ని ముందు తెలంగాణకు అందించే విధంగా చూడాలని సిఎస్ విజ్ఞప్తి చేసారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భారత బయోటెక్ ఎండీతో చర్చలు జరిపాం అని సీ ఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సిన్ ఇస్తుందన్న అందుకు సరిపడా డోసు లు సరఫరా చేయాలని కోరామని ఆయన అన్నారు. సానుకూలంగా స్పందించిన భారత్ బయోటెక్ సంస్థ ఎండీ… సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news