కాఫీ తాగడం వల్ల నష్టాలూ ఉన్నాయా..?

కాఫీ అంటే చాలా మందికి ఇష్టం కంటే ఎక్కువే. ప్రతి రోజూ నిద్రలేవగానే కాఫీ తప్పకుండా తీసుకోవాలి లేకపోతే ఉత్సాహం, ఉల్లాసం ఏమీ ఉండదు. ఒక కప్పు కాఫీ పడ్డాక ఉత్సాహంగా, వేగవంతంగా పనులు పూర్తి చేయగలరు అని చాలా మంది చెప్పడం మనం వినే ఉంటాం. అయితే ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే నిజంగా కలిగేది లాభమా..? నష్టమా..? ఈ విషయం గురించి ఇప్పుడే చూసేయండి. వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం అతిగా కాఫీ తాగితే మాత్రం కష్టమేనని అంటున్నారు. కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి అని వెల్లడించారు.

అతిగా తాగకుండా మరి ఎన్ని కప్పులు తాగవచ్చు అని ఈ పాటికే మీకు సందేహం కలిగి ఉండవచ్చు. రోజుకు రెండు సార్లు మాత్రమే కాఫీ తాగాలని అంతకుమించి తాగితే మాత్రం పలు సమస్యలు తప్పవని వైద్యులు అంటున్నారు. పునరుత్పత్తి వ్యవస్థ పై కాఫీ తీవ్రంగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. ఇంట్లో కాఫీ తాగకపోయినా బయట తాగుతూ ఉంటారని పెద్ద పెద్ద శబ్దాలు వింటూ కాఫీ తాగితే వినికిడి సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పడం జరిగింది.

కాబట్టి ఎప్పుడు కూడా భారీ శబ్దాలు వినిపించే చోట కాఫీకి దూరంగా ఉంటే బావుంటుందని కెనడా లోని మెక్ గ్రిల్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి చెప్పడం జరిగింది. చూసారా దీని వల్ల కాఫీ తాగడం వల్ల కేవలం రిఫ్రెష్ మెంట్, స్ట్రెస్ తగ్గిపోవడం ఇంకా ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ పలు నష్టాలు కూడా ఉన్నాయి అని వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ అలవాటు ఉన్నవాళ్లు మానుకోవడం మంచిది లేకుంటే అనేక సమస్యలు మీ దరి చేరుతాయి.