చాలామంది బయట అమ్మే బజ్జీ, పకోడీ వంటివి తింటూ ఉంటారు. చాలా చోట్ల గమనించినట్లయితే న్యూస్ పేపర్లో కట్టేసి వాటిని ఇస్తుంటారు. న్యూస్ పేపర్ లో కట్టేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించడం మంచిది. న్యూస్ పేపర్లలో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి హానికరం. వాటిలో డస్ట్ తో పాటుగా బ్యాక్టీరియా ఇలా చాలా రకాలు ఉంటాయి. దీని వలన ఆహారం విషంగా మారుతుంది చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఫుట్ పాయిజనింగ్ వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా వస్తాయి. చిన్న చిన్న విషయాల్లో మార్పులు చేసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ కాలం జీవించొచ్చు. న్యూస్ పేపర్లలో ప్యాక్ చేసే బదులుగా టిష్యూ పేపర్లలో మీరు ఆహార పదార్థాలను ప్యాక్ చేసుకొని తీసుకోవచ్చు. బయట ఎక్కడైనా ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు మీరు బాక్స్ వంటివి ఏదైనా తీసుకువెళ్లి వాటిలో పెట్టి తెచ్చుకోవచ్చు.
న్యూస్ పేపర్లలో ఆహార పదార్థాలను తెచ్చుకోవడం వలన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అలాగే ప్లాస్టిక్ సంచుల్లో ఆహార పదార్థాలను పెట్టుకోవడం వలన మైక్రో ప్లాస్టిక్స్ కడుపులోకి వెళ్ళిపోతాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. చూసారా వీటివల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో మరి ఇకనైనా ఈ విషయాల్లో తప్పు జరగకుండా చూసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.