తరచూ ఆకలి వేస్తుందని ఏది పడితే అది తింటున్నారా..? ఇవి చేర్చండి.

-

నిద్రలేక కొంతమంది బాధపడుతుంటే..అతి నిద్రతో ఇంకొంత మంది ఇబ్బందిపడతారు.. అలాగే కొందరికి అస్సలు ఆకలి వేయదు..ఏదీ తినాలనిపించదు. ఇంకో బ్యాచ్‌ ఉంటుంది.. తరచూ ఆకలి వేస్తూ ఉంటుంది. ఏది తిన్నా వెంటనే ఆకలి వేస్తుంది. అలా అని ఏది పడితే అది తింటే.. లావు అయిపోతాం.. ఒక్కోసారి మధ్య రాత్రి కూడా లేచి ఆకలేస్తుందని.. ఏదో ఒకటి తింటూ ఉంటాం. దీంతో ఒక్కోసారి ఈ ఆకలేమిటా అని మనపై మనకే కోపం వస్తుంది. కరోనా టైంలో కూడా చాలామంది అతి ఆకలితో ఇబ్బంది పడ్డారు.. వీటికి కారణాలు, ఏం తింటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చో చూద్దాం..

బాదం: బాదంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్‌లతో సమృద్ధిగా ఉంటాయి. బాదంపప్పు తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది, బాదంపప్పుతో విటమిన్ E, మోనోశాచురేటెడ్ కొవ్వు మెరుగుపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

కొబ్బరి: తినే ఆహారంలో కొబ్బరి సంబంధిత పదార్థాలు తీసుకోవడం ద్వారా తరచూ ఆకలి వేసే సమస్యను తగ్గించుకోవచ్చు. కొబ్బరిలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్లు క్యాప్రిక్, క్యాప్రిలిక్, క్యాప్రోయిక్, లారిక్ యాసిడ్‌లను కలిగి ఉంటాయి. కొబ్బరిలోని అధిక ఫైబర్ కంటెంట్ సంపూర్ణత్వ భావనను పెంచుతుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మొలకలు: మొలకలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు..నానబెట్టుకుని చాలా మంది మొలకులు తింటుంటాం. మొలకలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో ఆకలి తీరిన అనుభూతి ఉంటుంది..మొలకలలో ఉండే ప్రొటీన్ కంటెంట్‌ మనకు అవసరమైన శక్తినిస్తాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా ఎక్కువుగా ఆకలి వేయకుండా ఉండేందుకు డైట్ ప్లాన్‌లో మొలకలను యాడ్ చేసుకోవడం బెటర్. వీటి వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఇతర లాభాలు కూడా ఉన్నాయి..

మజ్జిగ: మజ్జిగ మంచి ప్రోబయోటిక్ . ఇందులో వెయ్ ప్రొటీన్ అధికంగా ఉంటుంది. మనల్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

వెజిటెబుల్ జ్యూస్‌లు: వివిధ కూరగాయలతో తయారు చేసిన రసాలలో యాంటీ ఆక్సిడెంట్ల కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది. ముఖ్యంగా అవిసె గింజలతో తయారు చేసిన జ్యూస్ ఎంతో ఆరోగ్యకరం. ఇది స్కిన్‌కు చాలా మంచిది.

ఒత్తిడి కారణంగా ఎక్కువ ఆకలి వేయవచ్చని కొందరు భావిస్తుంటే.. పోషకాహార లోపం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. మనం తినే ఆహారంలో ఇలాంటి స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా తరచూ ఆకలి వేసే సమస్యకు చెక్ పెట్టొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news