లాంగ్ డ్రైవ్ కారణంగా వెన్నునొప్పి వస్తుందా.. మీరు ఇలానే చేసి ఉంటారు..!

-

లాంగ్ డ్రైవ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఎక్కడలేని ఆనందం వస్తుంది కదూ.. కానీ.. లాంగ్ డ్రైవ్ లో కారు వెనుక కుర్చున్న వాళ్లు మస్త్ ఎంజాయ్ చేస్తారు. పాపం డ్రైవింగ్ చేసే వాళ్లకు అంత సేపు కంటిన్యూస్ గా డ్రైవ్ చేయడంతో బ్యాక్ పెయిన్ వస్తుంది. వెన్నునొప్పి విపరీతంగా వచ్చిందంటే.. ఇక ట్రిప్ కాస్త బిస్కెట్ అవుతుంది. ఎంజాయ్ మెంట్ పక్కన పెట్టి.. మూవ్ రాసుకుంటూ..మూవ్ అవ్వాల్సిందే..! కొన్ని జాగ్రత్తలు మొదటి నుంచే పాటిస్తే.. లాంగ్ డ్రైవ్ లో డ్రైవింగ్ చేసే వాళ్లకు ఎలాంటి నొప్పులు ఉండవట. మరి అవేంటో చూద్దామా..!

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటులో కూర్చున్న తర్వాత చాలామంది.. ముందుకు వంగి ఉంటారు. ఈ పరిస్థితిలో స్టీరింగ్ను పట్టుకోవడం సులభం. కానీ ఈ పద్ధతి వెన్ను నొప్పికి ప్రధాన కారణం అవుతుంది. దీని బదులుగా స్టీరింగ్ వీల్ నుంచి సరైన దూరాన్ని పాటించాలి. డ్రైవింగ్ లోనే కాదు..ఛైర్ లో కుర్చోని వర్క్ చేసేప్పుడు కూడా.. మనకు తెలియకుండానే మనం ముందుకు సిస్టమ్ దగ్గరకు వంగిపోతుంటాం… అందుకే బ్యాక్ పెయిన్ వస్తుంది.

కొందరు డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత సౌకర్యం కోసం సీటును వెనుకకు ఎక్కువగా వంచుతారు. ఈ పద్ధతి మీ వెన్ను భాగంలో ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలా చేయడం కూడా మానుకోండి.

వెన్నునొప్పి రాకుండా ఉండేందుకు సీటు ఎత్తును సర్దుబాటు చేయడం అవసరం. ముందుగా సీటును కింది స్థానం నుంచి ఆపై అవసరాన్ని బట్టి పైకి లేపుతూ క్రమంగా సర్దుబాటు చేసుకోవాలి.

మీరు ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తుంటే శరీరం అలసిపోతుంది. నిద్రమత్తులోకి జారుకునే ప్రమాదం కూడా ఉంది. మధ్యలో బండి ఆపి కాసేపు రిలాక్స్‌ కావాలి. విశ్రాంతి తీసుకోవడం ద్వారా డ్రైవింగ్ చేసే వాళ్లు రిఫ్రెష్‌ అవుతారు. అదేపనిగా త్వరగా వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో.. కొందరు గంటలతరబడి డ్రైవింగ్ చేస్తారు. దీని వల్ల మరుసటి రోజు విపరీతమైన నొప్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి.. లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే..ఎలాంటి నొప్పులు లేకుండా హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చట.!

Read more RELATED
Recommended to you

Latest news