వాళ్లు జై శ్రీరామ్ అంటే.. మనం జై హనుమాన్ అనాలి: కల్వకుంట్ల కవిత

-

కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెరాస గెలుపొందడమే మన ధ్యేయంగా అందరూ ముందుకు నడవాలి అన్నారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద తెరాస అభివృద్ధిపై కార్యకర్తలు చర్చ జరపాలని ఆదేశించారు.

ఇదే సందర్భంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై మండిపడ్డారు. అబద్దానికి ప్రతిరూపం ఎంపీ ధర్మపురి అరవింద్ అని అన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. వాళ్లు జైశ్రీరామ్ అని అంటే మేము జై హనుమాన్ అని అంటామని అన్నారు. మోడీ హయాంలో పెట్రోల్ నుండి నిత్యావసర వస్తువుల దాకా ధరలు భారీగా పెరిగాయి అన్నారు. రూపాయి విలువ భారీగా పడిపోయింది అని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అందరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇలాంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కవిత. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బిజెపి ని ఎందుకు విమర్శించరు.? అని ప్రశ్నించారు.

పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై బిజెపిని ఎందుకు విమర్శించరు.? బహుశా మ్యాచ్ ఫిక్సింగ్ ఏదైనా జరిగిందేమో.? అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు రావలసిన బకాయిల గురించి పార్లమెంటులో మాట్లాడాలని రాహుల్ గాంధీని మాట్లాడాలని జీవన్ రెడ్డిని ప్రజలు నిలదీయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news