పల్లెల్లో పిచ్చుకలు, పట్టణాల్లో పావురాలు మనం చూస్తూనే ఉంటాం. పావురాలు వచ్చి బాల్కనీలు, కిటికీలు, వెంటిలేషన్‌లలో విహరిస్తాయి. మనం కూడా వాటికి బియ్యం వేస్తూ టైమ్‌పాస్ చేస్తాం. కానీ మ్యాటర్ ఏంటంటే.. చాలా మందికి దీని గురించి పెద్దగా అవగాహన లేదు.. మానవులకు పావురాల నుండి అలెర్జీలు, వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లు వస్తాయి. ప్రస్తుతం ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ ముప్పు ఎక్కువగా నగరాల్లోనే ఉంది.
ముందుగా ఉన్న అలెర్జీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు. ఎందుకంటే పావురాలు అన్నింటిలో తీవ్రమైన అలెర్జీలు లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. పావురం ఈకలు, శరీరంలోని దుమ్ము, రెట్టలు అన్నీ చూసుకోవాలి. ఊపిరితిత్తుల సమస్యలను కలిగించే పదార్థాలు (అలెర్జీలు) వాటి ద్వారా మనుషులకు చేరతాయి. అలెర్జీ బాధితులకు ఇది చాలా కష్టం. మునుపటి ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతారు. దీర్ఘకాలిక దగ్గు, అలసట, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
పావురం రెట్టలు అతిపెద్ద ముప్పు. పావురం రెట్టలు తరచుగా వ్యాధికారక బాక్టీరియా, వైరస్లు మరియు శిలీంధ్రాలు కలిగి ఉంటాయి. వీటి వల్ల వచ్చే వ్యాధి ‘హిస్టోప్లాస్మోసిస్’. ఈ వ్యాధి ఫంగస్ వల్ల వస్తుంది. ‘హిస్టోప్లాస్మా క్యాప్సులాటం’ అనేది పావురం రెట్టలు ఎండిపోవడం ప్రారంభించినప్పుడు ఏర్పడే ఫంగస్. ఈ ఫంగస్ వ్యాధికి కారణమవుతుంది. ఇది సాధారణంగా తక్కువగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో మరింత తీవ్రంగా మారుతుంది.
పావురం రెట్టల్లో కనిపించే కొన్ని బ్యాక్టీరియా మనుషులకు చేరితే కడుపులో ఇబ్బంది కలిగిస్తుంది. కొందరు వ్యక్తులు ఈ రకమైన సమస్యలను క్రమం తప్పకుండా ఎదుర్కొంటారు. ఇవన్నీ కాకుండా పావురం శరీరంలో పరాన్నజీవులుగా మిగిలిపోయే చిన్నపాటి పురుగులు మన శరీరంలోకి ప్రవేశించడం కూడా సవాలే. ఈ సూక్ష్మజీవుల దండయాత్రలన్నీ చర్మ అలెర్జీలు, అంటువ్యాధులు, కొన్నిసార్లు ఇతర అనారోగ్యాలకు కారణమవుతాయి. కాబట్టి పావురాలతో జాగ్రత్తగా ఉండండి. నాంపల్లి మెట్రో దగ్గర పావురాల గ్యాంగే ఉంటుంది. ఊకే.. వాటికి ఏదో ఒక మేత వేస్తూ.. చాలా మంది అవి ఎగురుతుంటే.. పరిగెత్తుతూ వీడియోలు తీసుకుంటారు. ఇది సరదాగా ఉంటుందేమో కానీ ఆ తర్వాత మీ సరదా తీరిపోతుంది.