తమలపాకుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

-

పూజల్లో విరివిగా వాడే తమలపాకుల వల్ల మనకు ఎంత ఉపయోగం ఉందో తెలుసా. శుభకార్యాల్లో తాంబూలం ఇచ్చినప్పుడు తమలపాకు ఉండాల్సిందే. ఇంకా దీనితో బజ్జీలు కూడా వేస్తుంటారు. తమలపాకుల్లో మంచి ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారమట. ఈరోజు తమలపాకు గురించి తెలుసుకుందాం.

betel leaf

తమలపాకుల్లో యాంటీ మైక్రోబియల్ క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. కార్డియో వాస్కులర్ డిసీజ్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు నివారణలో తమలపాకు తోడ్పడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

తమలపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన పూర్వీకులకు దీని ఉపయోగాల గురించి బాగా తెలుసు. తమలపాకు సున్నంతో కల్లీ వేసుకుంటే నోరు పండుతుంది. భోజనం తర్వాత తమలపాకుతో కిల్లీ వేసుకోవటం చాలామందికి అలవాటు. జీర్ణక్రియను మెరుగుపరచటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

విటమిన్-సీ, థియామిన్, రైబోఫ్లోవిన్, కేరోటిన్ లాంటి విటమిన్లు తమలపాకుల్లో పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం వీటిలో గొప్ప మూలం. వాస్తవానికి తమలపాకుల ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది. ఇది పోషకాలకు గొప్ప వనరుగా దోహదపడుతుంది.

వీటిలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ వంటి నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్లు, స్టెరాయిడ్లు, క్వినోన్లు ఉన్నాయి.

సాంప్రదాయ వైద్యంలో గాయాలు, మంట, ఉబ్బసం చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. సంప్రదాయ ఔషధంలో ఇతర ప్రయోజనాలు నోటి కుహరం లోపాలు, జీర్ణ సంబంధిత సమస్యలు, ఒత్తిడిని తగ్గించడంలో కూడా మంచిసహాయకారణి.

ప్రతి రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుందట.

రోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియాల గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారుట.

తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుందట.

తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి. తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుందంటారు. అయితే ఇది ప్రయత్నించేముందు వైద్యుల పర్యవేక్షణ అవసరం.

గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది. తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది.

ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుందట.

చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇలా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయనమాటు తమలపాకులో..తమలపాకే కదా అని ఈజీగా తీసిపారేయకండి మరి.!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news