కేంద్రం రైతు నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి- సీఎం కేసీఆర్..

-

తెలంగాణ సర్కారు చేపట్టిన మహాధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందిరా పార్్కలో జరుగుతున్న ఈ ధర్నాలో మరో సారి కేంద్రంపై విమర్శలు చేశారు. రైతుల నిరంకుశ చట్టాలు రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టే విధానాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు. పంజాబ్ లో ధాన్యాన్ని కోనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఢిల్లీ పర్యటనలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరితే 50 రోజుల నుంచి ఉలుకుపలుకు లేకుండా నిద్ర నటిస్తుందని విమర్శించారు. తెలంగాణ రైతుల బాధ దేశానికి తెలిసేందుకే ధర్నాలకు పిలుపు ఇచ్చామన్నారు. ఉత్తర భారతంలో రైతుల చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకు తెలంగాణ లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతాయని సీఎం వెల్లడించారు. రైతుల ప్రయోజనాలు కాపాడే దాకా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలను ఉప్పెనలా కొనసాగిస్తామన్నారు. కేంద్రం పెద్దలకు రైతు సమస్యలు తెలిసేలా తెలంగాణ ప్రభుత్వం ధర్నాను కొనసాగిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news