ప్రతి ఇల్లాలి ఆరోగ్యానికి 10 చిట్కాలు ఏంటో తెలుసా..?

-

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇల్లాలు అందరి మేలు కోరుకుంటుంది కానీ తన ఆరోగ్య అవసరాలను పట్టించుకోదు. అలాంటి ఇల్లాలు తప్పకుండా పాటించవలసిన చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. కొంతమందికి ఒత్తిడి వల్ల సరిగా నిద్రపట్టకపోవచ్చు. అలాంటప్పుడు ఒక టేబుల్ స్ఫూన్ గసగసాలు కొద్దిసేపు నీటిలో నానబెట్టి వేడి పాలల్లో ఈ మిశ్రమాన్ని కలుపుతూ త్రాగడం వల్ల సరైనా నిద్రపడుతుంది.

2.కొంతమందిలో వాతపరమైన నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారు దాల్చిన చెక్క పొడిని రోజూ వేడిపాలలో వేసుకుని త్రాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

3.ఉబ్బసం , ఆయాసం వున్నవారు ఇంగువ మరియు పచ్చ కర్పూరం కలిపి బఠాణి గింజంతా మొత్తం లో రోజూ పరగడపన తీసుకుంటూ వుంటే ఉపశమనం లభిస్తుంది.

4. నీరసంగా అనిపించినప్పుడు బార్లీ గింజల పొడి వేసిన నీరు త్రాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

5.ఋతుక్రమణ సమయంలో కడుపునొప్పి, కాళ్ళ నొప్పులు బాగా తగ్గాలంటే మెగ్నీషియం ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.

6. ఆడవారు ఎక్కువగా రక్త హీనతతో బాధపడేవారు నువ్వులు, బెల్లం, పల్లీలతో చేసిన పదార్థాలను, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.డ్రై ఫ్రూట్స్ ఎక్కువుగా తీసుకోవాలి.

7.ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువుగా ఉన్నవారు వేరుశనగా నూనె కానీ, కొబ్బరి నూనెకానీ, నువ్వుల నూనె కానీ గోరువెచ్చగా చేసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల తొందరగా తగ్గుతాయి.

8.వంట చేసేటప్పుడు చేతులు కాలడం, వేడి నూనె పడటం లాంటివి జరిగినప్పుడు కాలిన ప్రదేశాల్లో కలబందను రాయడం వల్ల మంట తగ్గి దాని తాలూకా మచ్చలు పడకుండా చేస్తుంది.

9. పని హడావిడి లో పడి నీటిని ఎక్కువుగా తీసుకోవడం మర్చిపోతుంటారు.దానివల్ల డీ హైడ్రెట్ అవుతుంటారు. అలాంటప్పుడు నీరు రోజుకి కనీసం 4లీటర్ల అయినా త్రాగుతూ ఉండాలి.నీటిశాతం ఎక్కువ గా వున్న పండ్లను తినాలి.ముఖ్యంగా ఎక్కువగా గోరువెచ్చని నీరు తాగుతూ వుంటే రక్తం బాగా శుభ్రపడి ముఖము నీగారింపు సంతరించుకుంటుంది.

10. ముఖ్యంగా ఇంట్లో వుండే ఆడవారు టిఫిన్ నీ స్కిప్ చేసి ఏకంగా మధ్యాహ్నం భోజనం చేస్తారు. దీనివల్ల కడుపులో గ్యాస్ పార్మ్ అవుతుంది. మరియు రక్తహీనత కూడా ఏర్పడుతుంది.హార్మోనల్ సమస్యలు తలెత్తు డానికి సగం కారణం అవుతాయి. భోజనం సరైనా సమయంలో సరైనా మొత్తాదులో తినకపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news