ఛాతిలో తరచూ నొప్పి వస్తుందా..? ఇన్ఫెక్షన్‌ కారణం కావొచ్చు..

-

కారణం లేకుండా ఏదీ జరగదు..అలాగే ఏ సమస్యా లేకుండా బాడీలో ఏ భాగంలో నొప్పులు రావు. ఏదైనా పెయిన్‌ మాటిమాటికి వస్తుంది అంటే.. అదే భవిష్యత్తులో వచ్చే ఏదో జబ్బుకు సంకేతం. మనం ఆ సంకేతాలను ఎంత త్వరగా గ్రహిస్తే సమస్య నుంచి అంత త్వరగా బయటపడొచ్చు. కొంత మందికి ఛాతి దగ్గర అప్పుడప్పుడు నొప్పిగా, బరువుగా అనిపిస్తుంది. చాతీ భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇది గ్యాస్‌ అని చాలామంది లైట్‌ తీసుకుంటారు. అయితే గ్యాస్‌ లేకపోతే హార్ట్ ఎటాక్‌ ఇంతే తెలుసు.. కానీ ఈ భాగంలో నొప్పి అనేది ఇంకా చాలా సమస్యలకు సంకేతం.. అవేంటో, ఏమై ఉంటాయో చూద్దామా..!

ఛాతీలో నొప్పి ఉంటే, ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం..

ఆంజినాః ఆంజినా (Angina) అనేది ఛాతీలో నొప్పి లాంటిది. ఇది గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. ఆంజినా నొప్పిలో.. సాధారణ ఛాతీ నొప్పి కంటే ఎక్కువ నొప్పి వస్తుంది. మరోవైపు గుండెకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఆంజినా సమస్య ఉండవచ్చు. ఇది రెండు రకాలు.. స్టేబుల్ ఆంజినా.. అస్థిర ఆంజినా. గుండె చాలా వేగంగా రక్తాన్ని పంప్ చేసినప్పుడు స్థిరమైన ఆంజినా ఏర్పడుతుంది. అస్థిరమైన ఆంజినాలో గుండె రక్తాన్ని పంపింగ్ చేయడంలో సమస్య ఏర్పడుతుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది.

గుండె ఇన్ఫెక్షన్ కారణంగా ఛాతీ నొప్పి- గుండె ఇన్ఫెక్షన్ ఉన్న రోగులు ఛాతీ నొప్పిని అనుభవించవచ్చు. గుండె వైరల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తరచుగా మయోకార్డిటిస్ వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ సమస్యలలో గుండె కండరాలు ఎర్రబడతాయి. దీని కారణంగా ఛాతీలో ఎక్కువగా నొప్పి ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఛాతీ నొప్పి సమస్యను అశ్రద్ద చేయకూడదు.

గుండెపోటు- గుండెపోటుకు ముందు ఛాతీలో తీవ్రమైన నొప్పి సమస్య ఏర్పడుతుంది. ఛాతీ నొప్పిని గుండెపోటు లక్షణంగా పరిగణిస్తారు. అందువల్ల ఆకస్మిక ఛాతీ నొప్పిని ఎప్పుడూ సాధారణమైనదిగా తీసుకోకూడదు. ఎందుకంటే గుండెపోటు సమస్యకు ముందు ఇలాంటి సంకేతాలు, సమస్యలు పెద్దగా రావు.

తరచూ ఛాతి భాగంలో నొప్పి వస్తుంటే తగిన పరీక్షలు చేయించుకుని కారణాలు తెలుసుకుని చికిత్స ప్రారంభించాలి. చిన్న నొప్పే కదా.. దీనికి ఎందుకు ఆసుపత్రికి వెళ్లడం వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తారు.. కాసేపు పడుకుంటే తగ్గుతుందిలే.. ఇలాంటి ధోరణి అస్సలు మంచికి కాదు. మనకంటే మనీ ఏం అంత ఎక్కువ కాదు..మనం అనేదే లేకపోతే..ఇక మీ దగ్గర ఎన్ని పైసలుంటే ఏం లాభం చెప్పండి.. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎప్పుడూ అశ్రద్ద చేయకూడదు. అందులోనూ గుండెకు సంబంధించి సమస్యలుంటే అస్సలు నిర్లక్ష్యం తగదు.

Read more RELATED
Recommended to you

Latest news