లేచి చేసేదేం ఉందిలే అని ఎక్కువసేపు నిద్రపోతున్నారా..?

-

కంటి నిండా నిద్రపోతే.. మనసుకు చాలా హాయిగా ఉంటుంది. ఆ రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. వాళ్లకు ఎంత నిద్రపోదాం అన్నా నిద్ర రాదు.. ఇంకొంతమంది.. ఇప్పుడు లేచి చేసే పని ఏముంది అని తెగ నిద్రపోతారు. టైమ్‌ ఉంది కదా అదేపనిగా పడుకుంటే మీకు బాగుంటుందేమోకానీ..ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు.. ప్రతి రోజూ రాత్రి 7-8 గంటల సమయం నిద్రపోయే వారికంటే, 8-9 గంటలు నిద్రపోయే వారిలో డెత్ రేట్స్ అధికంగా ఉన్నట్లు కొన్ని పలు అధ్యయనలు స్పష్టం చేస్తున్నాయి.
చాలామంది ఖాళీగా ఉన్నాం కదా అని ఎక్కువగా నిద్రపోతుంటారు. వారాంతాల్లో అయితే ఇక మధ్యాహ్నం వరకూ లేవరు.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. వారాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయేవారిలో గుండె పనితీరు దెబ్బతింటుందని తేలింది. ఎక్కువగా నిద్రపోయినా సమస్యలు తప్పవు..తక్కువగా నిద్రపోయినా సమస్యలు తప్పవు.. అందుకే వేళకు తగినంత నిద్రపోవాలి.7 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారిలో సుమారు 50శాతం మందిలో కుంగుబాటు లక్షణాలు ఉన్నాయని అధ్యయనలు చెబుతున్నాయి. ఉదయం పూట లేచాక తలనొప్పి, వెన్నునొప్పి, మగత వంటి ఇబ్బందులేవీ లేకుండా హాయిగా, హుషారుగా ఉన్నామనే భావన కలిగితే కంటి నిండా నిద్రపోయినట్టే అనుకోవచ్చు.
అతి తక్కువగా నిద్రపోతే 82 శాతం స్ట్రోక్‌, రాత్రి పూట ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే, తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్‌ ముప్పు 23 శాతం ఎక్కువట. అధిక నిద్ర వల్ల కూడా డిప్రెషన్‌కు లోనవుతారని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. అతిగా నిద్రపోవడం వల్లన జ్ఞాపక శక్తి తగ్గడం, విచారంగా ఉండటం వంటి సమస్యలు కూడా వస్తాయి. కొలెస్ట్రాల్‌ స్థాయి, అధిక బరువు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టైమ్‌ ఉంది కదా అని అదేపనిగా నిద్రపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news