కోవిడ్ నుండి రికవరీ అయ్యాక బూస్టర్ షాట్ మేలు చేస్తుందా?

కోవిడ్ నుండి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే సరైన మార్గమని శాస్త్రవేత్త నుండి ప్రభుత్వాల వరకు అందరూ చెబుతున్నారు. ఐతే వ్యాక్సిన్ పనితనం ఎన్ని రోజులు ఉంటుందనేదే అసలు ప్రశ్న. వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని వారాలకి దాని పనితనంలో మార్పులు వస్తాయని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ బూస్టర్ షాట్ల ప్రస్తావన వచ్చింది. వ్యాక్సిన్ తీసుకుని వారాలు గడిచిపోతున్నా. లేదా తీసుకున్నా కూడా రోగనిరోధక శక్తి పెరగకుండా ఉంటే బూస్టర్ షాట్ తప్పని సరి అని చెబుతున్నారు. ఈ విషయమైన అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

covid booster

అసలు బూస్టర్ షాట్ అంటే ఏమిటి?

వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో రోగనిరోధక శక్తి ఎక్కువ పెరగకుండా ఉన్నట్లయితే దాన్ని పెంచడం కోసం వ్యాక్సిన్ ని బూస్టర్ గా ఇస్తారు.

ఇది ఎవరెవరికి అవసరం ఉంటుంది.

ముందే చెప్పుకున్నట్టు వ్యాక్సిన్ తీసుకుని నెలలు గడిచిపోతుంటే లేదా వ్యాక్సిన్ వల్ల రోగనిరోధక శక్తిపెరగనపుడు ఇది అవసరం ఉంటుంది.

కోవిడ్ నుండి రికవరీ అయిన వాళ్ళకు ఇది అవసరం ఉంటుందా?

కోవిడ్ సోకిన రికవరీ అయిన వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి. అవి చాలరోజులు మన శరీరంలో బ్రతికే ఉంటాయి. వాటివల్ల కరోనా వైరస్ మళ్ళీ సోకకుండా ఉంటుంది. దీని ప్రభావం ఎక్కువరోజులు ఉంటుంది. అది కూడా ఆ మనిషికి ఉన్న శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఐతే ఇలాంటి వాళ్ళకు బూస్టర్ షాట్ సరిపోతుందని కొందరు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్ల కంటే వీరిలో యాంటీ బాడీస్ చాలా ఉత్తేజకరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఐతే కరోనా నుండి రికవరీ అయిన వాళ్లకు బూస్టర్ షాట్ సరిపోతుందా అన్న విషయమై మరిన్ని పరిశోధనలు జరపాలని, అప్పటి వరకూ ఇలాంటి విషయాల్లో కంక్లూజన్ కి రాలేమని శాస్త్రవేత్తల వాదన.