ఐదో టెస్ట్‌ కు ముందే టీమిండియా బిగ్‌ షాక్‌.. ప్రాక్టిస్‌ రద్దు

ప్రస్తుతం ఇంగ్లండ్‌ టూర్‌ లో టీమిండియా ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌ లో భాగంగా… ఇప్పటికే నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ లు పూర్తి కాగా.. మరో టెస్ట్‌ మ్యాచ్‌ మిగిలి ఉంది. అయితే.. ఈ కీలకమైన ఐదో టెస్ట్‌ కు ముందే భారత జట్టు ఊహించని షాక్‌ తగిలింది. 5 టెస్ట్‌కు ముందు భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌ కు దూరమయ్యారు. జట్టు సహాయక బృందంలో మరోకరికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యం లోనే ప్రాక్టీస్‌ ను రద్దు చేశారు. దీంతో ప్రాక్టీస్‌ లేకుండానే ఐదో టెస్ట్‌ కు భారత్‌ క్రికెట్‌ జట్టు బరిలోకి దిగ నుంది. ఇక ఇప్పటికే కరోనా కారణంగా కోచ్‌ రవి శాస్త్రి మరియు ఇద్దరు సహాయక కోచ్‌ లు జట్టు కు దూరం గా ఐసోలేషన్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. రేపటి నుంచి ఇండియా మరియు ఇంగ్లాండ్‌ జట్ల మధ్య చివరి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఇక రేపు మధ్యాహ్నం 3.30 సమయంలో ఐదో టెస్ట్‌ ప్రారంభం కానుంది. కాగా.. ఈ ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ లో 2-1 తేడాతో టీమిండియా ముందంజలో ఉంది.