మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా..? కారణం ఇదే కావొచ్చు..!

మూత్రం నుంచి దుర్వాసన రావడం అనేది మంచి విషయం కాదు. ఇలా దుర్వాసన వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. దీని వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంతకీ ఇలా వాసన ఎందుకు వస్తుంది..? కారణాలు ఏంటో చూద్దామా..!

డీహైడ్రేషన్: శరీరంలో తీవ్రమైన డీహైడ్రెషన్ సమస్య వల్ల మూత్రం రంగు మందపాటి పసుపు రంగులోకి మారుతుంది. దీని తరువాత మూత్రంలో మంట సమస్య వస్తుంది. అప్పుడు కూడా శ్రద్ధ చూపకపోతే.. మూత్రం మళ్లీ మళ్లీ వచ్చినట్లు ఒత్తిడి పెరుగుతుంది. కానీ మూత్రం రాదు. చుక్కలు చుక్కలు మాత్రమే వస్తాయి. ఇలాంటి సందర్భంలో మూత్రం నుంచి బలమైన దుర్వాసన వస్తే శరీరంలోని అంతర్గత అవయవాలలో ఇన్ఫెక్షన్ పెరుగుతోందనడానికి సంకేతం.
ఆహారం- పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, మొలకలు, ఇంగువ, మొలకలను క్రమం తప్పకుండా లేదా పెద్ద పరిమాణంలో తినే వ్యక్తుల్లో మూత్రం ఘాటైన వాసన వస్తుందట..అయినప్పటికీ, ఈ పరిస్థితిని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇది మూత్రంలో సల్ఫర్ పరిమాణం పెరగడం వల్ల జరుగుతుంది.
చెడు అలవాట్లు- మద్యం సేవించే వ్యక్తుల్లో మూత్రం కూడా ఘాటైన వాసనతో ఉంటుంది. అలాంటి పరిస్థితి ధూమపానం చేసేవారిలో కూడా ఉంటుంది. సోడా, కోక్ వంటి పానీయాలను అధికంగా లేదా క్రమం తప్పకుండా తాగేవారికి మూత్రం వాసన వచ్చే సమస్య ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇది మూత్రం వ్యాధి లక్షణం కాదు, కానీ ఈ కారణాలన్నీ శరీరాన్ని లోపలి నుంసీ బలహీనంగా మారుస్తాలీ. అందువల్ల, ఈ అలవాట్లను ముందుగానే నియంత్రించడం అవసరం.
మహిళల్లో ఇలాంటి సమస్య ఉంటే..
UTI  సంక్రమణ
తక్కువ నీరు తాగడం అలవాటు
గర్భం సమయంలో
ఔషధాల వినియోగం
మద్యపానం, ధూమపానం
ప్రెగ్నెన్సీ కాకుండా ఈ సమస్య ఉంటే. వెంటనే వైద్యులను సంప్రదించండి.