రాత్రిపూట డైరీ రాయడం వల్ల నిద్ర బాగా పడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

ఏదైనా కష్టం వచ్చినపుడు అతిగా ఆలోచించకుండా దాని గురించి పేపర్ మీద రాసి, ఆ కష్టం వల్ల వచ్చే ఇబ్బందులేమిటీ అనే విషయాల గురించి పేపర్ మీద రాస్తే ఒక స్పష్టత వస్తుందని చాలా మంది చెబుతుంటారు. అది సరే, అది మంచి నిద్రకి దారి తీస్తుందా అనేది చాలామంది అనుమానం. రాత్రిపూట పడుకునే ముందు డైరీ రాయడం వల్ల నిద్ర బాగా పడుతుందని, ప్రశాంతంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మంచి నిద్ర కోసం డైరీ రాయ‌డం

ఇక్కడ డైరీ అనడం కంటే నిద్రపోయే ముందు రాసే జర్నల్ అని చెప్పుకోవాలి. పడుకునే ముందు మీరు రాసే రాతలు మీలోని ఒత్తిడిని బాగా తగ్గిస్తాయి. ఆలోచనలన్నీ కలగాపులగంగా ఉన్నప్పుడు పేపర్ మీద రాతలు రాయడం బాగా మేలు చేస్తుంది. ఇక్కడ ఏం రాయాలన్న ఆలోచన ఉండకూడదు. మీకేమనిపిస్తే అది రాసేయడమే. మీ గురించి మీరు రాసుకుంటున్నారు. అందులో ఏం ఉన్నా అది మీదే. కాబట్టి నిజాయితీగా ఉండాలి. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది.

మంచి నిద్ర కోసం.. ఏం రాయలన్న విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే..

ఆ రోజు కోపాలు, బాధలు అన్నీ రాయండి. ఎవరి మీద ఎందుకు కోపం ఉంది తదితర విషయాలన్నీ రాసుకోండి. మీ మనసులో ఆలోచనలన్నీ పేపర్ మీద పెట్టండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారి దగ్గరి నుండి మీరు ఇబ్బంది పెట్టిన సంఘటనల గురించి రాయండి.

మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన మనుషులు ఉంటారు. డైరీలో వారికి థ్యాంక్స్ చెప్పేయండి. మీకు సాయం చేసిన వారి పేర్లు రాసుకోండి. మీ మనసులు బాగా నచ్చిన సందర్భాలు ఒకటో రెండో ఉంటాయి. వాటి గురించి రాయండి.

రేపేం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏం చేస్తే మీ పరిస్థితి మెరుగు అవుతుందని మీరనుకుంటున్నారో దాని గురించి రాయండి. రేపు చేసే పనులు ఒక వరుస క్రమంలో పెట్టుకోండి.

ఇలా మీ మనసులోని భావాలన్నీ కాగితంలోకి ఎక్కించాక హాయిగా నిద్రపోండి. నిద్ర స‌రిగా ప‌ట్ట‌డం లేదు అనేది ఇక ఉండ‌దు. సుఖ‌మ‌య నిద్ర కోసం ఈ టిప్స్ పాటిచండి