ఇలా చేస్తే డెంగ్యూ నుండి త్వరగా రికవరీ అవ్వచ్చు..!

ఈ మధ్య కాలంలో డెంగ్యూ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. నిజంగా డెంగ్యూ అనేది కాస్త ప్రమాదకరమని చెప్పాలి. ఏది ఏమైనా సకాలంలో వైద్యం తీసుకుంటే ఈ సమస్య నుండి త్వరగా కోలుకోవడానికి అవుతుంది. ఈ సమస్య ఉంటే ఎక్కువ జ్వరం, వాంతులు, తలనొప్పి, జాయింట్ పెయిన్స్, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనపడతాయి.

dengue | డెంగ్యూ
dengue | డెంగ్యూ

డెంగ్యూ కనుక వచ్చిందంటే హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. అలానే సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకుని ఈ సమస్య నుండి బయట పడడానికి ప్రయత్నం చేయాలి. అయితే డెంగ్యూ సమస్యతో బాధపడే వాళ్ళు త్వరగా రికవరీ అవ్వాలంటే వీటిని తీసుకోండి. దీనితో డెంగ్యూ లేదా మలేరియాతో బాధపడే వాళ్ళు త్వరగా రికవరీ అవ్వచ్చు.

గుల్ ఖండ్:

గుల్ ఖండ్ లో పోషక పదార్థాలు ఉంటాయి. ఇది ఎసిడిటీ, తలనొప్పి, కాన్స్టిపేషన్, నిద్రలేమి సమస్యలు, వీక్నెస్, వికారం వంటి లక్షణాలకు సహాయం చేస్తుంది. ఉదయాన్నే మొదట గుల్ ఖండ్ ను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా కోలుకోవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు లేదా మీరు కావాలంటే మీల్ కి మీల్ కి మధ్యలో తినొచ్చు. ఇది ఎసిడిటి, వికారం వంటి సమస్యల నుంచి త్వరగా బయటపడేస్తుంది.

పసుపు పాలలో కుంకుమ పువ్వు మరియు నెట్ మెగ్:

ఇది కూడా మంచి సొల్యూషన్. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కూడా మీరు సమస్యల నుండి బయట పడవచ్చు. దీనికోసం మీరు ఒక గ్లాసు పాలలో ఒక గ్లాసు నీళ్ళు పోసి అందులో పసుపు వేసి కుంకుమపువ్వు, నట్ మెగ్ కూడా వేసి కలిపి చల్లగా కానీ వేడిగా కానీ తీసుకోవచ్చు. రుచి నచ్చకపోతే కొద్దిగా బెల్లం వేసుకొని కూడా తీసుకోవచ్చు.

హైడ్రేట్ గా ఉండండి:

హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. అందుకని ఎక్కువ నీళ్లు, జ్యూస్లు, కొబ్బరి నీళ్లు తీసుకోండి. రికవరీ అవడానికి ఇవి బాగా ఉపయోగ పడతాయి. అలానే అన్నం తో చేసిన జావ వంటివి మీరు తీసుకోవచ్చు. ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా యోగ కూడా రికవరీ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. యోగాసనాలు నడుం నొప్పి, ఒళ్ళు నొప్పులు నుంచి బయట పడేస్తాయి.