Bigg Boss 5 Telugu Elimination: బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేష‌న్ టెన్ష‌న్‌..! డేంజర్‌ జోన్‌లో ప్రియ‌, ల‌హ‌రి !! అవుటయ్యేది ఆమెనేనా?

Bigg Boss 5 Telugu Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజ‌యవంతంగా మూడు వారాలను కాంప్లీట్ చేసుకుని.. మూడో ఎలిమినేష‌న్ కు సిద్ద‌మ‌య్యింది. ఈ ఎలిమినేష‌న్‌లో ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు వెళ్లిపోతార‌నే ఆస‌క్తి నెల‌కొంది. గడిచిన రెండు ఎలిమినేషన్స్ పరిశీలిస్తే.. దాదాపు ప్రేక్ష‌కులు ఊహించిన‌దే జ‌రిగింది. తొలుత సరయు, త‌రువాత ఉమాదేవి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఇప్పుడూ మూడవ వారం హౌస్ లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయేదెవ‌రనేది ఉత్కంఠగా మారింది.

ఈ వారం నామినేషన్స్‌లో మానస్‌, ప్రియాంక సింగ్‌, శ్రీరామచంద్ర, ప్రియ, లహరి ఉన్నారు. అయితే ఇందులో ఇప్పటికే కొందరు సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో సపోర్ట్ కనిపిస్తుంది.
మాన‌స్ త‌న ప‌ని తాను చేసుకుంటూ సైలెంట్ గా తన ఆట తాను ఆడుకుంటున్నాడు. దీంతో ఆయ‌న‌కు బాగానే ఓట్లు పడుతున్నట్లు కనిపిస్తుండగా.. అటు శ్రీరామ్‌కు ఫ్యాన్స్‌ సపోర్ట్ బలంగా కనిపిస్తుంది.

కానీ, ప్రియా, లహరీలూ డేంజర్ జోన్లో ఉన్న‌ట్టు వారం వ‌స్తున్నాయి. తాజాగా.. ఓ ప్ర‌ముఖ వెబ్ సైట్.. మూడో వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతార‌ని స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం.. లహరి ఎలిమినేట్ అవుతుందని తేలింది. ఆమెకు 43 శాతం మంది హౌస్ నుంచి ఎలిమినేష‌న్ అవుతుంద‌ని ఓట్లు వేశారు. ప్రియకు 33 శాతం ఓట్లు, ఆ తరువాతి స్థానంలో 10 శాతం ఓట్లతో ప్రియాంక, మానస్ శ్రీ‌రామ్‌లు 7 శాతం ఓట్లతో నిలిచారు. ఈ స‌ర్వే ప్ర‌కారం లహరి మాత్రం గేమ్‌నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా క‌నిపిస్తుంది.

కానీ, గతవారంలో రవి, ప్రియ, లహరిలకు జ‌రిగిన మాట‌ల యుద్దంలో అర్జున్ బ్యూటీ ల‌హ‌రి బ్యాడ్ అయిపోయింది. యాంకర్ రవి, లహరిలు టాయిలెట్‌లోకి దూరి హగ్ చేసుకున్నారంటూ ప్రియ ఆరోపణలు చేయడం. దీంతో ఈ విష‌యం ర‌చ్చ ర‌చ్చ కావ‌డం. అంత‌కు ముందు ర‌వి.. ప్రియ‌తో ల‌హ‌రి గురించి చేడుగా చెప్ప‌డం. ఈ విష‌యం తెలుసుకోకుండా రవిని గుడ్డిగా నమ్మడం.. ప్ర‌తి విష‌యానికి ర‌వి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం లాంటివి ల‌హ‌రి బ‌ల‌హీన‌త‌లుగా భావించ‌వ‌చ్చు. దీంతో ఈ వారం.. ల‌హ‌రి ఎలిమినేష‌న్ కానున్న‌ద‌ని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

కానీ బిగ్‏బాస్ తమ స్టాటజీ ఉపయోగించి.. టీఆర్పీ రేటింగ్ కోసం లహరిని కాకుండా.. ప్రియను ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోన‌వ‌స‌రం లేదు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ప్రియ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు హౌస్‌లో హీట్ ను పుట్టించాయి. రవి, లహరిలు ఇద్దరు లేట్ నైట్ హగ్ చేసుకున్నారు. లహరి ఎక్కువగా అబ్బాయిలతోనే ఉంటుందని ఆరోపించడంతో హౌస్ లో దూమారం రేగింది. దీంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ షాకయ్యారు. కొంత‌మంది మాత్రం ఆమె మాటల‌ను తప్పు ప‌ట్టారు. దీంతో కంటెస్టెంట్లలో కొంద‌రూ ప్రియను నామినేట్ చేస్తూ వచ్చారు. అలాగే బయట కూడా ప్రియకు నెగిటివిటి వచ్చేసింది.

కానీ.. ఇటీవ‌ల రవి లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. దీంతో ప్రియ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని.. రవి చెప్పడం వల్లే ఆమె అలా మాట్లాడిందని ప్రేక్ష‌కుల్లో ఆమెపై పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో రవి వ‌ల్ల లహరి బలికానున్న‌దనే మీమ్స్‌ వైర‌ల్ అవుతున్నాయి. మొత్తం మీద అయితే.. ల‌హ‌రి, ప్రియలు డేంజ‌ర్ జోన్‌లోనే ఉన్నార‌ని చెప్పాలి.

అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏమౌతుందో చెప్పలేని పరిస్థితి.. ఒక్కోసారి ఈ ఓటింగ్ మొత్తాన్ని పక్కన పెట్టేసి.. ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లని కూడా ఎలిమినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బిగ్‏బాస్ షో టీఆర్పీ రేటింగ్ పెంచాల‌నుకుంటే.. మాత్రం ప్రియను ఎలిమినేట్ చేసి.. ల‌హ‌రిని షో నే ఉంచి .. లవ్ ట్రాక్స్.. ట్రయాంగిల్ స్టోరీస్, కాస్త రొమాన్స్‌ అంటూ షోపై ఆసక్తిని పెంచుతాడు బిగ్ బాస్‌. గత సీజన్లలో కూడా బిగ్ బాస్ ఇలాంటి ప్ర‌యోగాలే చేసి షోని స‌క్సెస్ చేశాడు. ఎవ‌రూ ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలంటే మాత్రం.. ఈ వారం చివ‌ర వ‌ర‌కు వేచి చూడాల్సిందే..