మీకు బాగా వేడిగా టీ తాగే అలవాటుందా..? సుర్ర్..మంటే కానీ, తాగినట్టుండదా..? మీకు దండం పెడతాంకానీ, ఆపేయండి. కనీసం నాలుగు నిమిషాలు ఆగండి. ఆ తర్వాత తాగండి.

జాగ్రత్త… మీకు అన్నవాహిక కాన్సర్ వచ్చే ప్రమాదముంది. 75 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ వేడితో టీ తాగితే, అన్నవాహిక కాన్సర్ వచ్చే ముప్పు రెండింతలు అవుతుందని ఈ మధ్య ప్రచురించబడిన ఒక స్టడీ తేల్చింది. అయితే టీ వచ్చిన తర్వాత ఒక నాలుగు నిమిషాలు ఆగి తాగితే, ఈ ముప్పునుంచి తప్పించుకోవచ్చని ఆ పరిశోధన తెలియజేసింది.
ఎందుకొచ్చిన గొడవ.. కాసేపాగి తాగితే పోలా..!