ఈ మధ్యకాలంలో ఉద్యోగాలకు చేసే వాళ్లకు చెవినొప్పి ఎక్కువగా వస్తుంది. చాలా ఉద్యోగాలు విని చేసేవే ఉంటున్నాయి. మళ్లీ 9 గంటలు జాబ్ చేసి వచ్చాక కూడా ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటుంటారు. చెవి నొప్పి ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ మందిని వేధిస్తుంటుంది. చెవి నొప్పి రావడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. చెవిలో ఇన్ఫెక్షన్‌లు ఉన్నప్పుడు కూడా చెవి నొప్పి బాధిస్తుంది. వర్షంలో తడటం వల్ల కూడా తీవ్రమైన చెవి నొప్పి, చెవులు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే.. చెవి సమస్యను నివారించవచ్చు.
చెవినొప్పికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చెవి నొప్పితో బాధపడేవారు ముఖ్యంగా చెవులను ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలి.
తడి తగలకుండా, చలిగాలి చెవుల్లోకి చేరకుండా జాగ్రత్త తీసుకోవాలి.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే, వెంటనే తగ్గిపోయేలా వైద్య సలహాలు పాటించాలి. వైద్యులు సూచించిన మేరకు తగిన మందులు వాడుతూ, గొంతును జాగ్రత్తగా చూసుకోవాలి.
చెవులు మృదువైన కాటన్‌తో తుడవకూడదు.
ఇయర్ ఫోన్స్ అలవాటు ఎక్కువగా ఉంది. చెవుల్లో ఎప్పుడూ ఇయర్‌ఫోన్‌లు పెట్టుకోవడం మంచిది కాదు..అలాగే ఇతరులు ఉపయోగించే ఇయర్‌ఫోన్‌లను మీరు ఉపయోగించకుండా ఉంటే మంచిది..ఇయర్ బడ్స్ వాడటం మానేయండి. ఇయర్ బడ్స్ చెవిలో ఇన్‌ఫెక్షన్‌ను పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఇయర్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
చెవి నొప్పిని తగ్గించడంలో ఉప్పు కూడా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఉప్పు వేసి గోరువెచ్చగా వేయించి, ఒక మెత్తటి కర్చీఫ్ లాంటి బట్టలో వేసి మూటకట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు మూటతో నొప్పి ఉన్న చెవి చుట్టూ కాపడం పెట్టుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తులసి ఆకుల రసాన్ని చెవిలో వేస్తే క్షణాల్లో నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చెవి నొప్పి నుంచి బయటపడొచ్చు. అయితే నొప్పి ఎక్కువ రోజులు ఉంటే వైద్యులను సంప్రదించాలి. కొన్నిసార్లు చెవిలో గడ్డలు ఉన్నప్పుడు కూడా నొప్పి తీవ్రంగా ఉంటుంది.