బరువు తగ్గడానికి సులువైన మార్గాలు..!

మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారా…? అయితే ఈ టిప్స్ మీ కోసం. ఈ విధంగా మీరు అనుసరించడం వల్ల వేగంగా బరువు తగ్గొచ్చు. చాలా మంది భారతీయులు టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఎక్కువ మందికి పాల తో చేసిన టీ అంటే చాలా ఇష్టం.

 

రోజుకి 4 నుండి 5 కప్పులు వరకు తాగుతూ ఉంటారు. దీని కారణంగా బరువు పెరుగుతారు మరియు గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే రెగ్యులర్ గా మీరు తాగే టీ కంటే ఈ టీ తాగడం వల్ల బరువు తగ్గడానికి వీలవుతుంది. మరి వాటి కోసం ఇప్పుడే మనం చూద్దాం.

గ్రీన్ టీ ని ఇలా తయారు చేసుకోండి:

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉంటుంది మరియు ఎనర్జీని కూడా ఇది ఇస్తుంది. ఇంట్లో గ్రీన్ టీ సులువుగా తయారు చేసుకోవడానికి ఈ పద్ధతిని అనుసరించండి.

ముందుగా ఒక పాన్ లో గ్లాసు నీళ్లు పోయండి. లో ఫ్లేమ్ మీద ఉంచి వేడి చేయండి. నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత తులసి ఆకుల్ని వేసి తర్వాత అల్లం కూడా వేసి ఉంచండి. కొద్దిగా మెంతులు కూడా ఆ నీళ్లలో వేసేయండి. దాల్చిన చెక్క కూడా వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగేయండి. దీనిని మీరు రోజూ తాగడం వల్ల బరువు సులువుగా తగ్గొచ్చు.

అలాగే బ్లాక్ టీ కూడా బరువు తగ్గడానికి బాగుంటుంది. కొవ్వు కూడా ఇట్టే కరిగిపోతుంది.

బ్లాక్ టీ ని ఈ విధంగా తయారు చేసుకోండి:

దీని కోసం ఒక పాన్ లో టీ ఆకులు వేసి నీళ్లు పోయండి. ఇది బాగా మరిగిన తర్వాత వడకట్టి తీసుకోండి. ఈ టీని వేడిగా తీసుకుంటే బరువు తగ్గొచ్చు మరియు కొవ్వు కూడా కరిగిపోతుంది.