జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే వీటిని తినండి..!

-

చలికాలం వలన చాలా మంది జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చలి కాలంలో జాయింట్ పెయిన్స్, చర్మ సమస్యలు వంటివి కూడా కలుగుతూ ఉంటాయి. అయితే చలికాలంలో ఇమ్యూనిటీ పై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఈ రోజు కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి చూద్దాము. మీరు డైట్ లో కనుక వీటిని తీసుకుంటే చక్కటి పోషకపదార్థాలు మీకు అందుతాయి. అయితే ఆ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

 

వెల్లుల్లి:

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కనుక వెల్లుల్లిని ఎక్కువగా వంటల్లో వాడండి. దానితో ఈ సమస్యలకి దూరంగా ఉండచ్చు.

అల్లం:

అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చలికాలంలో దీనిని తీసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. హృదయ సంబంధిత సమస్యలు రిస్కు తగ్గుతుంది. అలానే వికారం వంటి సమస్యలు కూడా ఉండవు.

పాలకూర:

పాలకూరలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా పాలకూర సహాయం చేస్తుంది. కాబట్టి చలికాలంలో సమస్యలు రాకుండా ఉండాలంటే పాలకూర కూడా తీసుకోండి.

సిట్రస్ ఫ్రూట్స్:

నిమ్మ, కివి, ఆరెంజ్ వంటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇవి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పెరుగు:

ఇమ్యూనిటీని పెంచడానికి పెరుగు కూడా బాగా ఉపయోగపడుతుంది. అలానే తేనే, బొప్పాయి కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి చలికాలంలో ఈ ఆహార పదార్థాలను తప్పక తీసుకోండి. జబ్బుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news