వైట్‌ చాక్లెట్స్‌ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట.. ఇంకా ఎన్నో లాభాలు..!!

-

చాక్లెట్స్‌ తింటే పళ్లు పుచ్చిపోతాయి అని అందరూ అంటారు. అయితే డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మనమూ చాలా సార్లు విన్నాం.. తలనొప్పిని తగ్గిస్తుంది, డిప్రషన్‌ నుంచి బయటపడేస్తుంది ఇంకా డార్క్‌ చాక్లెట్స్‌ వల్ల ఏవేవో లాభాలు ఉన్నాయి.. అయితే వైట్‌ చాక్లెట్స్‌ తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..?

 

వైట్ చాక్లెట్ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.. మెదడుకు సంబంధించి చాలా రుగ్మతలతో పోరాడే ఫ్లేవనాయిడ్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు రాకుండా ఇవి కాపాడుతాయి. వైట్ చాక్లెట్ తినడం వల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని నయం అవుతుంది. మతిమరుపు ఉంటే వీటిని తింటూ ఉండొచ్చు.

వైట్ చాక్లెట్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. నరాలు, గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నోటి ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి వారానికోసారైనా వైట్ చాక్లెట్ తినాలని నిపుణులు అంటున్నారు.

వైట్ చాక్లెట్లో వారే కోకో బటర్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వీటికి యాంటీ ఆక్సిడెంట్ల గుణం ఎక్కువ. ఇవి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికరక్తపోటు రాకుండా అడ్డుకుంటుంది. వైట్ చాక్లెట్లను కోకో బటర్‌తోనే చేస్తారు. కాబట్టి ఇవి శరీరంలో ఇన్ఫ్లమ్మేషన్ రాకుండా అడ్డుకుంటాయి. వచ్చినా కూడా వాటితో చురుకుగా పోరాడుతాయట.

వైట్‌ చాక్లెట్స్‌ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. అవాంఛిత కొవ్వు చేరడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. అవి రాకుండా గుండెను కాపాడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. దీనివల్ల గుండెపోటు రాదు. ఆహారంలోని విటమిన్లను గ్రహించేలా చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయో కదా..!!

అధిక రక్తపోటు ఉన్న వారు రోజుకో చిన్నముక్క వైట్ చాక్లెట్ తినడం ఎంతో మంచిది. దీనిలో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

మహిళలకు ఎక్కువగా వచ్చే రొమ్ము క్యాన్సర్‌ నుంచి కూడా వైట్‌ చాక్లెట్స్‌ కాపడతాయి. దీనిలో పాలీ ఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలు తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news