కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా కంటిపై శ్రద్ధ పెట్టాలి. కంటి ఆరోగ్యం దెబ్బతింటే మనకి ఎంతో కష్టమవుతుంది. అందుకనే ప్రతి రోజు కూడా కంటి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. మరి కంటి ఆరోగ్యం పైన ఎలా శ్రద్ధ పెట్టాలి అని దాని కోసం ఇప్పుడు చూద్దాం.
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సమయం స్క్రీన్లపై గడుపుతున్నారు. పిల్లల మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు తో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు అందుకోసం కంటే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి లేదంటే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి.
కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఇలా అనుసరించండి:
కళ్ళజోడు ధరించండి:
మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు కళ్ళజోడు పెట్టుకోండి అదే విధంగా కంప్యూటర్ తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా గ్లాసెస్ వేసుకోండి సరైన గ్లాసులను ధరించడం వల్ల కంటికి రక్షణ ఉంటుంది. అదేవిధంగా హానికరమైన యూవీ కిరణాల నుండి కూడా కంటికి రక్షణ ఉంటుంది.
స్మోకింగ్ మానేయండి:
స్మోకింగ్ కూడా మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది స్మోకింగ్ మానేస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు. స్మోకింగ్ వలన ఆప్టిక్ నర్వ్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని దీనికి దూరంగా ఉండండి.
సమతుల్యమైన ఆహారం తీసుకోండి:
బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆకుకూరలు, సాల్మన్, ట్యూనా, గింజలు, బీన్స్, నట్స్ వంటివి డైట్ లో తీసుకుంటూ ఉండండి అలానే సిట్రస్ ఫ్రూట్స్ కూడా డైట్ లో ఉండేటట్లు చూసుకోండి.
కంటిని రబ్ చెయ్యద్దు:
చాలామంది కళ్ళను అస్తమానూ నలుపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల కంటికి ఎఫెక్ట్ అవుతుంది. మన చేతులకు ఉండే దుమ్ము ధూళి బ్యాక్టీరియా వంటివి కళ్ళకి అంటుకుంటాయి. ఇన్ఫెక్షన్స్ కలుగుతాయి.