నడుం నొప్పి తగ్గాలంటే ఈ ప్రాసెస్ పాటించండి..!

Join Our Community
follow manalokam on social media

ఈ రోజుల్లో యుక్త వయసు వారి నుంచి వయో వృద్ధుల వరకు అందరికీ ఉన్న ప్రధాన సమస్య నడుం నొప్పి. సాధారణంగా నడుం నొప్పి రెండు రకాలు.. మొదటిది అక్యుట్‌లో బ్యాక్‌ పెయిన్‌. రెండవది క్రానిక్‌లో బ్యాక్‌ పెయిన్‌. ఈ నొప్పి రావడానికి కారణం అనేకం. మనిషిని బట్టి.. వయసుని బట్టి.. పరిస్థితులను బట్టి నడుం నొప్పి తీవ్రత మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా, మనిషి వైకల్యానికి ఇది రెండో సాధారణ కారణం. సాధారణంగా నడుం నొప్పి మూడు నెలల కన్నా ఎక్కువ కాలం ఉంటే, దానిని ‘దీర్ఘకాలిక నడుం నొప్పి’ అంటారు. ఈ సమస్య చాలా మందికి వస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ తీవ్రత పెరుగుతుంది. వ్యక్తి జీవన విధానం మీద, వృత్తి, ఉద్యోగాల మీదా తీవ్ర ప్రభావం చూపుతుంది.

back pain

ఈ కారణాల వల్లే సమస్య..
యాక్సిడెంట్స్‌, వెన్నుపూసకు గాయాలు, ఫ్రాక్చర్స్‌: ప్రమాదాల్లో బలమైన దెబ్బ తగిలినప్పుడు శరీర కండరాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో.. వెన్నుపూస ఎముకలు విరగడం, వెన్ను మధ్యలోని జెల్‌ లాంటి డిస్కు బయటకు రావడం కూడా జరుగుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారికి విపరీతమైన నొప్పి వేధిస్తుంది. కాళ్లు కదల్చలేకపోవడం కూడా ఉంటుంది.
కండరాల స్ట్రైయిన్‌: వయసు పెరిగే కొద్ది కండరాలపై భారం పెరుగుతుంది. దీర్ఘకాలంగా బరువైన పనులు చేసే కూలీలకు, శ్రామికులకు వెన్నుపూస, డిస్క్‌ అరిగే అవకాశం ఎక్కువ. దీనివల్ల కూడా నడుం నొప్పి వస్తుంది.
క్షయ వ్యాధి: వెన్నుపూస ఎముకలకు క్షయ సోకి, చీము పడుతుంది. దీనివల్ల వెన్నుపూస ఎముకలు అరగడం, దెబ్బతినడం వంటివి జరుగుతాయి.
క్యాన్సర్‌ వ్యాధి: క్యాన్సర్‌ వెన్నుపూసకు సోకితే, వెన్నుపూస ఎముకలు ఫ్రాక్చర్‌ అవుతాయి.
మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌: మానసికంగా ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం వెన్నుపై పడుతుంది.
స్పాండిలైటిస్‌: ఈ నొప్పి నడుంపై పడుతుంది. తీవ్రమైన నడుం నొప్పి దీని లక్షణం.

చికిత్స ఇలా..
నడుం నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. దాన్ని బట్టి చికిత్స‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అసలు సమస్యను కనిపెట్టి, దానికి తగిన ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్లయితే నొప్పిని చాలా వరకూ తగ్గించవచ్చు. కన్జర్వేటివ్‌ థెరపీ, సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌, సైకలాజికల్‌ ట్రీట్‌మెంట్‌, బెడ్‌ రెస్ట్‌.. సమస్యను తీవ్రతను బట్టి వైద్యులు వీటిని సూచిస్తుంటారు.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...