సన్నగా ఉన్నవాళ్ళు పెరుగుతో వాటిని కలిపి తీసుకుంటే ఇట్టే బరుగు పెరుగుతారు..!!

-

ఈ మధ్య కాలంలో చాలామంది అధిక బరువుతో బాధ పడుతున్నారు..మరికొందరు సన్నగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు..సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి నిత్యం చాలా కష్టపడతారు. అలాంటి వారు కండరాలను పెంచుకోవడానికి, బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతారు. అయినప్పటికీ బరువు పెరగదు. అయితే.. బరువు పెరగడం, కండరాలను పొందడం చాలా కష్టం అంటున్నారు వైద్య నిపుణులు. అలాంటి వారు బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతుంటే ఈ విషయాల గురించి తెలుసుకోవాలి..

మన వంటింట్లో దొరికే వాటితో సులువుగా బరువు పెరగవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.బంగాళదుంపలు, పెరుగు బరువు పెరగాలనుకున్న వారికి చాలా సహాయం చేస్తాయి. శాకాహారులు బరువు పెరగడానికి ఇది మంచి ఎంపిక. బంగాళాదుంప, పెరుగు మీ బరువును పెంచడంలో ఎలా సహాయపడతాయో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం…

పెరుగు, ఆలు ఎలా బరువును పెంచుతాయో చూద్దాం..

కార్బోహైడ్రేట్లు మాత్రమే తినడం ద్వారా బరువు పెరుగుతారనే విషయం ఎంత నిజమో.. పిండి పదార్థాలు తినడం ద్వారా కూడా బరువు పెరుగుతారన్నది అంతే నిజం..బంగాళదుంపలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. బంగాళాదుంప బరువు పెరగడానికి సహాయపడుతుంది. బరువు పెరగడానికి ఒక మీడియం సైజు బంగాళాదుంపను తింటే..అప్పుడు శరీరానికి 150 నుంచి 160 కేలరీలు అందుతాయి. వాటిలో 37 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. బంగాళాదుంప కండరాలను పెంచడంలో సహాయపడుతుంది.

పెరుగు బరువును పెంచడంలో, తగ్గించడం లో సహాయపడుతుంది.ఫుల్ క్రీమ్ పాలతో చేసిన పెరుగు తింటే, అది బరువు పెరగడానికి సహాయపడుతుంది. 100 గ్రాముల ఫుల్ క్రీమ్ పాలు పెరుగులో 20 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 6 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది కండరాలను పెంచడంలో సహాయపడుతుంది. రోజూ 150 నుంచి 200 గ్రాముల పెరుగును అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో తీసుకుంటే శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది..ఉడికించిన ఆలును, పెరుగుతో కలిపి కొద్దిగా పంచదార వేసుకొని కలిపి తీసుకుంటే రుచి పెరుగుతుంది.బరువు కూడా పెరుగుతుంది..ఫ్యాట్ ఉన్న పెరుగును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. కేవలం ఒక నెల లోనే బరువు పెరిగినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news