అమ్మాయిలూ.. పిరియడ్స్‌ పై మీరు కూడా ఈ అపోహలను నమ్ముతున్నారా..?

-

మనకు ఎప్పటినుంచో చాలా విషయాలపై అపోహలు ఉంటాయి. అవి అపోహలు అని కూడా మనకు తెలియదు. అందులో చాలా ముఖ్యమైనది పిరియడ్స్. దీనిపై పూర్వం నుంచే బోలెడు చెప్తూ వచ్చారు. పిరియడ్స్‌ వచ్చిన వారికి దూరంగా ఉండాలి, వాళ్లను అంటుకోకూడదు అంటారు. ఈరోజు మనం పిరియడ్స్‌లో కామన్‌గా అమ్మాయిలకు ఉన్న అపోహలు అసలు నిజం ఏంటో చూద్దామా..!

అపోహ: పీరియడ్స్ సమయంలో వచ్చేదంతా చెడు రక్తం

నిజం: పిరియడ్స్‌ టైమ్‌లో వచ్చే బ్లడ్‌ అంతా చెడు రక్తం అని అనుకుంటారు.. ఇది పూర్తిగా అబద్ధం. మన శరీరంలో రక్తమే ఉంటుంది. అసలు చెడు రక్తం, మంచి రక్తం అని రెండు రకాలు ఉండవు. రక్త సంబంధ వ్యాధులు ఉన్న వారిలోనే రక్తం కలుషితం అవుతుంది. పీరియడ్స్ రక్తం అనేది శరీరంలో ప్రవహించే రక్తమే. ఇది మురికిది ఏమాత్రం కాదు.

అపోహ: పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం సహజం.

నిజం: డేట్‌ వచ్చినప్పడు నొప్పి రావడం అనేది కామన్‌ అని అందరూ అనుకుంటారు.. మంచి లైఫ్‌ స్టైల్‌ మెయింటేన్‌ చేసే వాళ్లకు అసలు నొప్పి రాదు. పిరియడ్స్‌ వచ్చిపోయినట్లు కూడా ఏం తేడా ఉండదు. కానీ కొందరికి మాత్రం పిరియడ్స్‌ వస్తున్నాంటే.. నాలుగు రోజుల ముందు నుంచే.. భయం మొదలవుతుంది. విపరీతమైన నొప్పితో బాధపడతారు. దీనికి ప్రాధాన కారణం.. వారు ఎక్కువగా జంక్‌ఫుడ్స్‌, వేడి చేసే ఆహారాలు తినడం అయితే.. మరొకటి ఏదేని ఆరోగ్య సమస్య కావొచ్చు. ఈ నొప్పిని వైద్య పరిభాషలో ‘డిస్మెనోరియా’ అంటారు. పీరియడ్స్‌లో నొప్పి రావడం సహజమైన విషయం కాదు. తరచుగా నొప్పి వస్తుంటే దాన్ని తేలికగా తీసుకోవద్దు. దీనికి ఎండో మెట్రియోసిస్, అడెనోమైయోసిస్, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి అంతర్లీన్ ఆరోగ్య సమస్యలు దాగి ఉండే అవకాశం ఉంది.

అపోహ: పీరియడ్స్ వచ్చిన సమయంలో నిల్వ పచ్చళ్లు, పెరుగు, పుల్లని, కారంగా ఉండే పదార్థాలు తినకూడదు..

నిజం: పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం అయినా తినవచ్చు. కాకపోతే వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉంటే పొట్టనొప్పి రాకుండా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటే ఇతర అనారోగ్యసమస్యలు రాకుండా ఉంటాయి.

అపోహ: ఈ సమయంలో ఎలాంటి శారీరకంగా కష్టపడే పనులు చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి.

నిజం: చాలా మంది పిరియడ్స్‌ టైంలో శారీరక శ్రమ చేసేందుకు ఇష్టపడరు. ఇది కచ్చితంగా అపోహే. రుతుక్రమంలో ఉన్న స్త్రీలు ఏపనీ చేయకూడదు అని లేదు. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే నొప్పులు, అసౌకర్యం ఇంకా పెరుగుతుంది.. వ్యాయామం చేస్తే నొప్పులు, పీరియడ్స్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

అపోహ: పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయకూడదు.

నిజం: అవును చాలామంది.. ఇది కూడా నమ్ముతారు.. ఇది అపోహ మాత్రమే..ఈ సమయంలో లైంగిక చర్యల వల్ల ఎలాంటి సమస్యలు రావు. మీకు ఆసక్తి ఉండి అసౌకర్యం లేకుండా ఉంటే పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.. అయితే పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం వల్ల కూడా గర్భం ధరించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news