డయబెటీస్‌కు గుడ్‌ న్యూస్.. మీరు ఇక తీపి తినొచ్చట..స్టడీ చెప్పిన సత్యం..!!

-

డయబెటీస్‌ అంటే యాంటీ స్వీటనర్స్‌ అన్న పేరు పడిపోయింది..పాపం వాళ్లకు తీపి తినాలనే కోరిక ఉన్నా.. తినలేని పరిస్థితి..చెక్కరకు బదులు బెల్లం తింటారు..అది కూడా ఎక్కువ తింటే డెంజరే.. కానీ రీసెంట్‌గా జరిగిన ఓ స్టడీలో డయబెటీస్‌ తీపి తినొచ్చని చెప్తుంది..అయితే అది పంచదార కాదు తేనె. పూల నుంచి వచ్చే పచ్చి తేనె తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని.. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అధ్యయనంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
డయాబెటిస్ ఉన్న వాళ్ళు పంచదారకి బదులుగా కృతిమ స్వీటెనర్ ఉపయోగిస్తారు. అయితే ఇక నుంచి దానికి బదులుగా తేనె తీసుకుంటే కార్డియో మెటబాలిక్ రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు..తేనె, చక్కెర రెండు కార్బోహైడ్రేట్లు. అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో తయారు చేస్తారు. అయితే రెండూ వేర్వేరు పోషకాలు, ఆకృతి, రుచి కలిగి ఉంటాయి. కొన్ని పోషక అంశాల దృష్ట్యా తేనె ఆరోగ్యకరమైనదని అంటారు. సాధారణంగా స్వీటేనర్లు వాడకం అంత మంచిది కాదు.. ఈ పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో గణనీయమైన పెరుగుతాయి.. జీర్ణాశయాంతర అసౌకర్యం లేదా పళ్ళు పుచ్చిపోతాయి. కొందరికి తేనె వల్ల అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుందని మరికొంతమంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులకు తేనె సురక్షితం కాదు.. అలాగే కృత్రిమ చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.. టొరంటో పరిశోధకులు దాదాపు 18 క్లినికల్స్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఈ అధ్యయనం రూపొందించారు. ఇందులో దాదాపు 1100 మంది పాల్గొన్నారు. గుండె, జీవక్రియ ప్రమాద కారకాలపై తేనె ప్రభావం ఎంత వరకు ఉందనే దాని మీద పరీక్షలు జరిపారు. క్లోవర్, రోబినియా పూల ద్వారా వచ్చిన తేనె జీవక్రియ మీద సానుకూల ప్రభావాన్ని చూపించింది. ఈ తేనె తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తక్కువ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. తేనె తీసుకోవడం వల్ల ఎటువంటి హాని లేదని రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గింపు అనేది దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు..

ముడి తేనె Vs ప్రాసెస్ చేసిన తేనె..

ప్రాసెస్ చేసే తేనెలో ఈస్ట్‌ను తగ్గించడానికి వడకట్టడం, తక్కువ సమయం పాటు వేడి చేయడం వంటివి చేస్తారు. దీని వల్ల తేనెలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అయితే ముడి తేనె వడకడతారు కానీ వేడి చేయరు. అయితే తేనెలో చాలా రకాలు ఉంటాయి. వాటన్నింటి మీద పరిశోధన చేయలేదు.. అలా చేయడం కష్టం కూడా.. మిశ్రమ తేనె ఏ పూల నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. అందుకే ప్రత్యేకమైన సింగిల్ ఫ్లవర్ మూలాల నుంచి వచ్చిన తేనె మీద మరిన్ని పరిశోధనలు చేయాలసిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.. ఏది ఏమైనా తేనెకి తీపి రుచి ఎక్కువ కాబట్టి పరిమితంగా తీసుకోవడమే మంచిది. అయితే ఒక్క విషయం క్లారిటీ.. కృత్రిమ స్వీటనర్స్‌ వాడేబదులు స్పెసిఫిక్‌ పూల నుంచి వచ్చే తేనెను లైట్‌గా వాడటం బెటర్‌..అది కూడా మీకు ఉన్న షుగర్‌ లెవల్స్‌ను బట్టి ఎంత వరకూ వాడాలో తెలుసుకోన్నాక మాత్రమే తీసుకోవాలి.!

Read more RELATED
Recommended to you

Latest news