గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ కాదు.. అంతకు మించిన ‘ఊలాంగ్‌ టీ’.. బెనిఫిట్స్‌ అదరహో..!!

-

ఇప్పుడు మనం రకరకాల టీలను చూస్తూనే ఉన్నా.. గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, వైట్ టీ, చామల్ టీ, అబ్బో మార్కెట్‌లో రకరకాల హెర్బల్‌ టీలు అందుబాటులో ఉన్నాయి.. ఈ టీలు అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.. ఇంకా బరువును కూడా తగ్గిస్తాయి.. వీటన్నింటికంటే నెంబర్‌ వన్‌ టీ ఒకటి ఉంది.. అదే ఊలాంగ్‌ టీ.. ఇదేంట్రా ఈ పేరు ఇలా ఉంది అనుకోకండి. దీని ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..

గ్రీన్ టీ, బ్లాక్ టీని తయారు చేయడానికి ఉపయోగించే కామెల్లియా సైనెసిస్ మొక్క ఆకుల నుంచే ఊలాంగ్ టీను తయారు చేస్తారు. గ్రీన్ టీ, బ్లాక్ టీలతో పోలిస్తే ఊలాంగ్ టీ తయారీలో కామెల్లియా సైనెసిస్ మొక్క ఆకులను ప్రాసెస్ చేసే విధానం వేరుగా ఉంటుందట.. కామెల్లియా సైనెసిస్ మొక్క ఆకులు గాలికి ఉంచినప్పుడు రసాయన చర్య జరుగుతుంది. దీన్ని బట్టి టీ రంగు, రుచి మారుతుంది.

ఈ రసాయన చర్యలో తేడాలను బట్టే.. టీలను వేర్వేరు పేర్లతో పిలుస్తున్నారు. సాధారణంగా గ్రీన్ టీ కోసం ఆక్సీకరణ చెందని కామెల్లియా సైనెసిస్ మొక్క తాజా ఆకులను ఉపయోగిస్తారు. ఇక, బ్లాక్‌ టీ కోసం ఈ ఆకులను ఆక్సీకరణ చెందడానికి పూర్తిగా చూర్ణం చేస్తారు. ఊలాంగ్ టీ తయారీ కోసం ఈ ఆకులు పాక్షికంగా ఆక్సీకరణ చెందడానికి ఎండలో కొద్దిసేపు ఉంచుతారు. ఈ ఆకులు వడలిపోయి కొద్దిగా ఎండిన తరువాత వాటితో ఊలాంగ్ టీని చేస్తారు.

తాజాగా తయారుచేసిన ఒక కప్పు ఊలాంగ్ టీలో ఖనిజాలు, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ టీ తాగితే మైండ్ ఫ్రష్‌గా ఉంటుంది.. టీ పాలీఫెనాల్స్‌గా పిలువబడే థెఫ్లావిన్స్, థియారూబిగిన్స్, EGCG వంటి యాంటిఆక్సిడెంట్స్‌కు ఇది పవర్ హౌస్ లాంటిది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఊలాంగ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ టీని తరచూ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధారణంగా గ్రీన్, బ్లాక్ టీలతో పోల్చితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మ్యుటాజెనిక్ ప్రభావం ఎక్కువగా ఉంటందని అని పరిశోధనల్లో తేలింది. ఈ ప్రభావం కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

ఈ టీలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ శరీర కొవ్వును బాగా తగ్గిస్తాయట.. దీంతో బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. ఊలాంగ్ టీ అనేది డయాబెటిస్‌తో పాటు దాని నుంచి వచ్చే ఇతర రోగాల నుంచి ఉపశమనం పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు ఈ టీని తాగితే ఇన్సులిన్ నిరోధకతను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మార్కెట్‌లో ఈ టీ మనకు లభిస్తుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ చేసుకోవచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news