వేస‌విలో పుదీనా ఇచ్చే లాభాల‌ను పొంద‌డం మ‌రువ‌కండి..!

-

పుదీనాను వేస‌విలో మ‌జ్జిగ‌లో వేసుకుని తాగ‌వచ్చు. లేదా నేరుగా పుదీనా ర‌సం తీసుకోవ‌చ్చు. అదీ కూడా వ‌ద్దనుకుంటే పుదీనాను స‌లాడ్స్ లో వేసుకుని తిన‌వ‌చ్చు.

మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆకుకూర‌ల్లో పుదీనా కూడా ఒక‌టి. దీని వాసన చాలా బాగుంటుంది. అందుక‌నే పుదీనాను చాలా మంది ప‌లు కూరల్లో వేస్తుంటారు. కొంద‌రు పుదీనాతో ఏకంగా చ‌ట్నీల‌ను చేసుకుని తింటుంటారు. పుదీనా నిజానికి మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిస్తుంది. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణాలు ఇందులో ఉంటాయి. క‌నుక వేస‌విలో పుదీనాను క‌చ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనాను వేస‌విలో మ‌జ్జిగ‌లో వేసుకుని తాగ‌వచ్చు. లేదా నేరుగా పుదీనా ర‌సం తీసుకోవ‌చ్చు. అదీ కూడా వ‌ద్దనుకుంటే పుదీనాను స‌లాడ్స్ లో వేసుకుని తిన‌వ‌చ్చు. లేదా పుదీనా టీ తాగ‌వ‌చ్చు. ఎలా తీసుకున్నా పుదీనాతో మ‌న‌కు లాభ‌మే క‌లుగుతుంది.

1. పుదీనాను తీసుకోవ‌డం వ‌ల్ల ఎండాకాలంలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. ఎండ‌లో బాగా తిరిగేవారు ఇంటికి చేరుకోగానే పుదీనా మ‌జ్జిగ తాగితే శ‌రీరం వెంట‌నే చ‌ల్ల‌బ‌డుతుంది.

2. వేస‌విలో మాంసాహారం తింటే కొంద‌రికి ప‌డ‌దు. అందుకని వారు పుదీనాను ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరం వేడి చేయ‌కుండా ఉంటుంది.

3. జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు పుదీనాను తీసుకుంటే ఆ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. ద‌గ్గు, జ‌లుబు, నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పుదీనాను తింటే ఫ‌లితం ఉంటుంది.

5. పుదీనాను రోజూ తింటే మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుందని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news