బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే సగ్గుబియ్యంతో సెట్‌ చేయండి.!

-

వెయిట్‌ గెయిన్‌..మనకు ఇది అస్సలు నచ్చని పదం.. కానీ చేసే పనుల వల్ల చాలామంది..తమకు తెలియకుండానే లావైపోతున్నారు. కొత్తగా కలిసిన దోస్త్‌గాడు..అరే ఏంట్రా ఈ మధ్యలావైనట్లున్నావ్‌ అనగానే.. ఇక మన ఇజ్జత్‌ పోయినట్లే అనిపిస్తుంది. తెగ ఫీల్‌ అయిపోతాం.. రేపట్నించి చూడు ఇది చేస్తా, అది చేస్తాం.. వారంలో పొట్ట తగ్గిస్తా అంటూ మంగమ్మ శపథం చేసేసుకుంటాం.. తెల్లారితే కథ మళ్లీ మాములే.! బరువు తగ్గాలంటే.. తిండి మానక్కర్లేదు..తినేవి మార్చితే చాలు.. సింపుల్‌ లాజిక్.. అప్లై చేయడమే కాస్త కష్టం కదూ..! సగ్గుబియ్యంతో కూడా ఈజీగా స్లిమ్‌గా కావొచ్చు..అదేలాగంటే..!

సగ్గు బియ్యంలో కొవ్వు పదార్దాలు చాలా తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు తరచుగా సగ్గుబియ్యం వాడటం చాలా మంచిది. శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికే కాదు, చిన్న పిల్లలకు తినే ఆహార పదార్ధంగా సగ్గు బియ్యాన్ని వాడొచ్చు.. సగ్గు బియ్యం తేలికగా జీర్ణమయ్యే మంచి ఆహారం. ఇందులో పోషకాల శాతం ఎక్కువగా ఉంటుంది. బాడీ హీట్‌ను కంట్రోల్‌ చేయడంలో సగ్గుబియ్యం చక్కగా పనిచేస్తుంది. అందుకే ఇంట్లోవాళ్లు వేడిచేసింది అంటే.. సగ్గుబియ్యంతో పాయసం అట్లా చేసి ఇస్తారు..! బియ్యంలోని విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది

సగ్గు బియ్యాన్ని నీటిలో ఉండికించి పంచదార కలుపుకుని తీసుకోవచ్చు. ఇలా తింటే..మలబద్దకం సమస్య దెబ్బకి పోతుంది. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్యలను తక్షణం సగ్గు బియ్యం తగ్గిస్తుంది. కండరాలను బలోపేతం చేసేందుకు సగ్గుబియ్యం చక్కగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పొటాషియం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు దూరమవుతాయి.

బరువు తగ్గాలనుకునేవారు సగ్గుబియ్యంతో చేసే రెసిపీస్‌ను ఉదయం టిఫెన్‌లో లేదా.. నైట్‌ డిన్నర్‌గా తింటే.. మంచి ఫలితం ఉంటుంది. సగ్గుబియ్యంతో చాలామంది కిచిడి చేస్తుంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇంకా చేయడం కూడా చాలా సులువు. ఇలాంటివి చేసుకుని తింటుంటే..కడుపు నిండుతుంది. జీర్ణవ్యవస్థకు కూడా మేలు.! ఇంకేంటి లేట్‌..డైట్‌లో ఉన్నవాళ్లు మీ లిస్ట్‌లో ఇది కూడా చేర్చుకోండి.!

Read more RELATED
Recommended to you

Latest news