పోషకాహార నిధి పాలకూర..!

-

సాధారణంగా ఆకుకూరలు తింటే చాలా మంచిది అని అంటుంటారు. పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర ఇలా ఏం తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పని చేస్తుంది.ఇందులో ఏకంగా పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు పాలకూర వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి కోసమే పూర్తిగా చూసేయండి.

పాలకూర లో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ క్యాన్సర్ ని నివారించడంలో తోడ్పడతాయి. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులు బ్రెస్ట్ క్యాన్సర్ ని అదుపు చేయడానికి ఇవి బాగా సహాయ పడుతాయి. గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి అంటే పాలకూర తీసుకోవాల్సిందే . ఇందులో ప్రొటీన్లు విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం వంటివి ఎన్నో ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెంచడానికి పాలకూర బాగా సహాయ పడుతుంది.

శరీరానికి కావలసిన ఐరన్ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే తత్వం పాలకూరలో ఉంది. వయసు తో వచ్చే మతిమరపును కూడా పాలకూర తో మనం తరిమికొట్టొచ్చు. పాలకూర తో సూప్, పప్పు, చపాతీలు, పాలక్ పన్నీర్ వంటివి ఎన్నో చేసుకోవచ్చు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చూశారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..! మరి ప్రతి రోజూ మీ డైట్ లో పాలకూరని చేర్చుకోండి. అనేక సమస్యల నుంచి సులువుగా బయట పడండి.

Read more RELATED
Recommended to you

Latest news