శ్వాసకోస వ్యాధులు చాలా ప్రమాదకరం.. ఇవి అప్పటివరకూ కామ్‌గానే ఉంటాయి.. సడన్‌గా ఏం అవుతుందో ఏమో కానీ.. అప్పటికప్పుడే సీరియస్ అయిపోతాయి.. అన్నం, నీరులేకున్నా.. ఒకరోజు పాటు ఉండొచ్చేమో కానీ.. గాలిపీల్చుకోకుండా మనిషి అరగంట కూడా ఉండలేడు.. అలాంటిది ఈ వ్యాధులు శ్వాసమీద ప్రభావం చూపిస్తాయి.. అలాంటిదే ఆస్తమా కూడా..ఈ వ్యాధి బారిన పడిన వారు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు. ఆస్తమా బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా మనం ఆస్తమాను తగ్గించుకోవచ్చు.
తేనె, నిమ్మరసం మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల మనం ఆస్తమాను తగ్గించుకోవచ్చు. ఆస్తమాను తగ్గించే సాధారణ గృహ నివారిణిగా తేనెను చెప్పుకోవచ్చు. తేనె శ్వాస మార్గాలను శుభ్రపరుస్తుంది. అలాగే నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఇవి రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు.
ఆస్తమాను తగ్గించడంలో కాకరకాయ తీగ వేరు ఎంతగానో పని చేస్తుంది. ఈ వేరును సేకరించి శుభ్రపరిచి పేస్ట్‌గా చేసుకోవాలి. తరువాత దీనికి అంతే మొత్తంలో తేనెను కానీ తులసి ఆకుల రసాన్ని కలిపి రాత్రి పూట సేవించాలి. నెల రోజుల పాటు ఇలా చేయడం వల్ల ఆస్తమాను తగ్గించుకోవచ్చు.
అల్లం, మెంతుల కషాయాన్ని తీసుకోవడం వల్ల కూడా ఆస్తమా వ్యాధి నుంచి మనం చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. ఒక కప్పు నీటిలో ఒక ఇంచు అల్లం ముక్క, ఒక టీ స్పూన్ మెంతులు వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఈ ఔషధం చాలా శక్తివంతమైనది. దీనిని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
వెల్లుల్లి రెబ్బలు కూడా ఆస్తమాను తగ్గించగలవు.. పది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని 30 మిల్లీ లీటర్ల పాలల్లో వేసి మరిగించాలి. అందులో రెండు టీ స్పూన్ల చక్కెరను కూడా వేసి కలపాలి. తరువాత ఈ పాలను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల ప్రారంభ దశలో ఉన్న ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు.
ఆస్తమాను తగ్గించడానికి రోజుకు రెండు సార్లు అల్లం టీ ని తాగండి.. ఈ జాగ్రత్తలను తీసుకోవడం వల్ల.. ఆస్తమా వ్యాధి నుంచి మనం సలుభంగా బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆస్తమాను తగ్గించే ఇంటి చిట్కాలు.. లైట్ తీసుకోకండి..!
కాకరకాయ తీగ వేరును శుభ్రపరిచి పేస్ట్‌గా చేసుకోవాలి. తరువాత దీనికి అంతే మొత్తంలో తేనెను కానీ తులసి ఆకుల రసాన్ని కలిపి రాత్రి పూట సేవించాలి. నెల రోజుల పాటు ఇలా చేయడం వల్ల ఆస్తమాను తగ్గించుకోవచ్చు.
అల్లం, మెంతుల కషాయాన్ని తీసుకోవడం వల్ల కూడా ఆస్తమా వ్యాధి నుంచి మనం చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు.
పది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని 30 మిల్లీ లీటర్ల పాలల్లో వేసి మరిగించాలి. అందులో రెండు టీ స్పూన్ల చక్కెరను కూడా వేసి కలపాలి. వడకట్టి తాగితే.. ప్రారంభ దశలో ఉన్న ఆస్తమా పూర్తిగా నయం అవుతుంది.