చిన్నపిల్లలను జంక్‌ఫుడ్‌ నుంచి దూరంగా ఉంచడం ఎలా..?

-

పెద్దవాళ్లం మనకే జంక్‌ ఫుడ్స్‌ మీద కంట్రోల్‌ ఉండదు. ఇంక చిన్న పిల్లలకు ఎలా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించిన ప్రతీది వారు కావాలనే అంటారు. అడిగిందల్లా కొనిస్తే మన పిల్లల ఆరోగ్యమే దెబ్బతింటుంది. జనరల్గా జంక్‌ఫుడ్‌ అంటే చిన్న పిల్లలు ఎగిరి గంతేస్తారు. మారంచేయకుండా తినేస్తారు. మరి వాళ్లను ఎలా జంక్‌ ఫుడ్‌ నుంచి దూరం పెట్టడం.. కొన్ని టిప్స్‌ ఫాలో అవడం వల్ల రిజల్ట్‌ ఉంటుందట.. అవేంటంటే..

ఇంట్లో వంట

బయట తిండిని వీలైనంత వరకు తగ్గించాలి. అలా చేయాలంటే ఇంట్లోనే వండాలి. పిల్లలకు ఇష్టమైన వాటిని ఇంట్లోనే చేయాలి. అవే పిజ్జాలు, నూడుల్స్‌ అయినా మీరు ఇంట్లో హెల్తీగా చేయొచ్చు. కూరగాయలు జోడించి చేశారంటే.. పోషకాలు కూడా అందుతాయి. ఇంటి ఆహారాన్ని పిల్లలు ఎంజాయ్‌ చేస్తూ తినేలా తల్లులు చేయాలి. కాస్త శ్రమ అనుకోకుండా ఎలా వెరైటీ వంటలను వీలైనంత వరకూ ఎలా హెల్తీగా చేయాలో తెలుసుకోండి.

ఇది హైలెట్..

జనరల్‌గా చిన్నపిల్లలకు టేస్ట్‌ కంటే దాని ఆకారానికే బాగా యట్రాక్ట్‌ అవుతారు. చూడ్డానికి రంగులరంగులగా ఉంటే వెంటనే అది వారి కంట్లో పడుతుంది. కొనిపెట్టేవరకూ మారాం చేస్తారు. సో..మనం కూడా ఇంట్లో చేసే వాటిని కాస్త ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలి..పిల్లలు చూడగానే వెరైటీగా ఉండాలి. అప్పుడే వారు వెంటనే తినేస్తారు. రకరకాల ఫ్రూట్స్‌తో డ్రస్సింగ్‌ చేయొచ్చు.

పోషకాలు తప్పనిసరి..

పిల్లలు చాలా తక్కువ తింటారు కానీ పదే పదే ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అందుకే వారికి బయటకు రాగానే మనసు జంక్‌ ఫుడ్స్‌ మీదకు పోతుంది. 3-4 సంవత్సరాల వయస్సు నుండి పిల్లల దినచర్యను ఒక క్రమపద్దతిలో ప్లాన్‌ చేయండి. వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించండి. దీని వల్ల పిల్లలకు కడుపు నిండుతుంది. జంక్ ఫుడ్ తినాలని కోరిక ఉండదు.

ఇలాంటి చిన్న చిన్న పెరెంటల్‌ టిప్స్‌ పాటించడం వల్ల వీలైనంత వరకు పిల్లలు జంక్‌ ఫుడ్‌కు యట్రాక్ట్‌ అవ్వరు. తినేప్పుడు రుచిగానే ఉంటాయి కానీ..అవి వారి కడుపులోని లేలేత భాగాల్ని దెబ్బతీస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news