దోస్తులు కాబ‌ట్టే తెలంగాణ సొమ్మును దోచుకుతింటున్నారు : వైఎస్‌ షర్మిల

-

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ‌లో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ ఎత్తున దోపిడీ జ‌రుగుతోంద‌ని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల. ఈ దోపిడీపై త‌క్ష‌ణ‌మే సీబీఐతో ద‌ర్యాప్తు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు వైఎస్ ష‌ర్మిల. ఈ మేర‌కు బుధ‌వారం జ‌ల సౌధ‌లోని సాగునీటి శాఖ ఉన్న‌తాధికారుల‌కు వైఎస్ ష‌ర్మిల విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ ష‌ర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ స‌ర్కారు, మేగా కృష్ణారెడ్డిల మ‌ధ్య బంధంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Image

తెలంగాణ కాంట్రాక్ట‌ర్లు క్వాలిఫై కాలేద‌న్న కార‌ణం చూపి ఆంధ్రా కాంట్రాక్ట‌ర్‌కు ప్రాజెక్టులు క‌ట్ట‌బెట్టార‌ని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల. అందుకే ప్రాజెక్టులన్నీ మెగాకే ఇచ్చారని కూడా తెలిపారు వైఎస్ ష‌ర్మిల. కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి దోస్తులు కాబ‌ట్టే తెలంగాణ సొమ్మును ప‌ట్ట‌ప‌గ‌లే దోచుకుతింటున్నారని ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ ష‌ర్మిల. కాళేశ్వరం నా చెమట, నా రక్తం అన్న కేసీఆర్.. మూడేండ్లకే ఆ ప్రాజెక్టు కూలిపోతే ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు వైఎస్ ష‌ర్మిల. కాళేశ్వ‌రం కేసీఆర్‌ క‌మీష‌న్ల ప్రాజెక్టు మాత్ర‌మేన‌ని, ఒక్క‌రికే 80 శాతం ప్రాజెక్టులు క‌ట్ట‌బెట్ట‌డం దేశంలోనే ఎక్క‌డా లేదన్నారు వైఎస్ ష‌ర్మిల. తెలంగాణ తెచ్చుకుంది వీళ్లిద్ద‌రి కోస‌మేనా? అని
ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news