మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలలో విటమిన్ కె2 కూడా ఒకటి. అయితే ఈ విటమిన్ ఉంటుందని చాలా మందికి తెలియదు. కానీ ఈ విటమిన్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. మన శరీరంలో కాల్షియం మెటబాలిజాన్ని ఈ విటమిన్ నియంత్రిస్తుంది. దీంతో కాల్షియాన్ని మన శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. అలాగే రక్తనాళాల్లో పేరుకుపోయే కాల్షియం తొలగించబడుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దీంతోపాటు చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే నరాలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి.
ఇక విటమిన్ కె2 ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు రాకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కాగా విటమిన్ కె2 మనకు అనేక పదార్థాల్లో లభిస్తుంది. మాంసం, గుడ్లు, పాలు, సోయా పాలు, చేపలు, అవకాడో, దానిమ్మ పండ్లు, గ్రేప్ ఫ్రూట్, బ్లూబెర్రీలు, బాదంపప్పు, గ్రీన్ యాపిల్, పాలకూర తదితర ఆహారాలను నిత్యం తీసుకోడం ద్వారా విటమిన్ కె2 మనకు పుష్కలంగా అందుతుంది.