కొలెస్ట్రాల్ సమస్య నేడు పదిలో ఆరుగురికి ఉంటుంది.. దీర్ఘకాలిక రోగాలకు.. ఇదే మూలం.. బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. అధికబరువు, డయబెటీస్, బీపీ ఇలా అన్నీ క్యూ కడతాయి. కానీ కొలెస్ట్రాల్‌కు జుట్టుకు సంబంధం ఉందని మీకు తెలుసా..? జుట్టు రాలిపోవడానికీ, శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికీ సంబంధం ఉంటుందని కేరళ యూనివర్శిటీ పరిశోధకులు తేల్చారు.
యూనివర్శిటీలోని.. జువాలజీ విభాగం, అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ రీజనరేటివ్ మెడిసిన్ అండ్ స్టెమ్ సెల్ రీసెర్చ్ ఇన్ క్యూటానియస్ బయోలజీ (AcREM-Stem) కలిసి ఈ పరిశోధన చేశాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పుడు… బయోసింథెసిస్ ప్రక్రియ జరుగుతుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లకు ఫైబ్రోసిస్ అనే ప్రక్రియ జరుగుతుందట.. ఈ ప్రక్రియ వల్ల కుదుళ్లు శాశ్వతంగా పాడవుతాయట. ఫలితంగా జుట్టు రాలిపోతుంది.
ఈ పరిశోధన పూర్తి వివరాల్ని ఎండోక్రినోలజీ అండ్ రీప్రొడక్షన్ అనే జర్నల్‌లో ప్రచురించారు.. “కొలెస్ట్రాలోజెనిక్ మార్పులు… సికాట్రిషియల్ ఎలోపెసియాకి దారి తీస్తాయి. ఇదో రకమైన మంట. ఇది జుట్టు కుదుళ్ల కణాలను నాశనం చేస్తుంది. అందువల్ల వెంట్రుకలు శాశ్వతంగా రాలిపోతాయి” అని ఈ పరిశోధనలో పాల్గొన్న లీడ్ ఆథర్ నజీబ్ తెలిపారు.
కేరళలోని 30 గ్రామ పంచాయతీల్లోని ప్రజల నుంచి సమాచారం సేకరించి.. ఈ పరిశోధన చేశారట.. అలా అయితే.. జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవారికి..కొలెస్ట్రాల్ ఉన్నట్లేనా..? అనుకోవచ్చు.. జుట్టు రాలిపోవడానికి కొలెస్ట్రాల్ కూడా ఒక కారణం అంతే.. జన్యు పరమైన కారణాలు, జుట్టుకి సరైన పోషణ లేకపోవడం, టెన్షన్, ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. ఏ కారణాలూ లేకపోయినా రోజూ ప్రతి ఒక్కరికీ 100 వెంట్రుకల దాకా రాలడం, కొత్తవి రావడం జరుగుతుందట…కాబట్టి జుట్టు రాలిపోతుంటే.. కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నట్లు అనుకోవద్దు. కాకపోతే.. తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకుంటే మంచిదే.
మైదా, పామాయిల్ వంటివి కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణం.. వాటిని తగ్గించుకోవడం లేక వాడటం మానేస్తే.. ఆరోగ్యం మెరుగవుతుంది. వైట్ ప్రొడెక్ట్స్ ఏవీ కూడా ఆరోగ్యానికి మంచివి కావు.. పంచదార, వైట్ రైస్, తెల్ల రవ్వ…పాలిష్ చేసి తినేవే మన కొంప ముంచుతాయని గుర్తుపెట్టుకోండి.!!