నోరు బాగుంటేనే గుండె సేఫ్‌.. దంతాలకు, హార్ట్‌కు సంబంధమేంటో..?

-

మన బాడీలో ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్య ఇంటర్‌లింక్‌ ఉంటుంది. ఎక్కడో కాలికి తగిలిన దెబ్బకు నోట్లోంచి టాబ్లెట్‌ వేస్తే తగ్గుతుంది. అలాగే.. దంతాలకు గుండెపనితీరుకు మధ్య సంబంధం ఉంటుందట. ఈ విషయం మీకు తెలుసా..?దంతాల ఆరోగ్యం బాలేకుంటే..గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రవాహంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది గుండె కవాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందట.

కృత్రిమ గుండె కవాటాలు(artificial heart valves) ఉన్నట్లయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డెంటల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స పొందిన రోగుల కంటే, చికిత్స పొందని రోగులకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 2.7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించి అధ్యయనంలో తెలిపారు.

జ్ఞానదంతాలతో జాగ్రత్త..

మన నోటిలోని జ్ఞాన దంతాలు శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థ, గుండె, కాలేయం, ప్రేగులకు అనుసంధానించి ఉంటాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా చిగుళ్లలోని కణజాలాల ద్వారా రక్తప్రవాహంలోకి వెళ్తుంది. ఆ తర్వాత శరీరమంతా వ్యాపించి గుండె కవాటాలు ద్వారా గుండెలోకి ప్రయాణిస్తుంది.ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీసే ధమనుల సమస్యకు కారణమవుతుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి..

గుండె సమస్యలు రాకూదంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు. దంతాలను కూడా హెల్తీగా ఉంచుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు.. ఊరు సంగతి దేవుడెరుగు..గుండె మంచిదవుతుంది. కాబట్టి..నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్వీట్లు, చెక్కర, శీతలపానీయాలు ఎక్కువ తీసుకోకూడదు, నోరు ఎప్పుడు తడిగా ఉండేలా చూసుకోవాలి, చాలామంది..బీర్లు బాటిల్స్‌, డ్రింక్‌ సీసాల మూతలు పళ్లతోనే తీస్తుంటారు. అలా చేయకూడదు.

అలా తీస్తే దంతాలు దెబ్బతింటాయి. ఏదైన తిన్న తర్వాత చేయి ఎలా శుభ్రం చేసుకుంటామో..నోరు కూడా శుభ్రం చేసుకోవాలి. అంతే డస్టీగా నోరు ఉంటుంది. ఎంగిలి చేయి ఎలాగో ఎంగిలి నోరు అని గుర్తుపెట్టుకోండి. తిన్న ప్రతిసారి..నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలంచాలి. లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌..మీకు ఎప్పటినుంచే చెప్పేదే అయినా మళ్లీ చెప్తున్నాం..పోగాకు, గుట్కాలు, జర్ధాలు, పాన్‌పరాకు లాంటివి నమలొద్దు. వీటి వల్ల నోటి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దాని వల్ల గుండె హ్యాపీగా ఉంటుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news