మనం ఎంత రెండు సార్లు స్నానం చేసినా చెమట పట్టడం అనేది సర్వసాధారణ విషయం. ఆ చెమట నుంచి దుర్వాసన రాకుండానే ఫ్రష్ ఫీల్ కోసం పర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. అయితే కొందరి దగ్గర నుంచి మరీ స్నానం చేసిన అరగంట నుంచే కంపు రావడం మొదలవుతుంది. పాపం వాళ్లు ఎంత క్లీన్‌గా ఉన్నా, ఇంట్లోనే ఉన్నాసరే చెమట పట్టేస్తుంది. బాడీలోపల గార్భేజ్ ఎక్కువ పేరుకుపోయినప్పుడు అంటే మోషన్ సరిగ్గా జరగనప్పుడు అలా జరుగుతుంది. అయితే చెమట నుంచి వచ్చే వాసన బట్టి డయబెటీస్ ఉందా లేదా అని చెప్పేయొచ్చట..! మధుమేహంను ఇలా కూడా గుర్తించ వచ్చు అంటున్నారు నిపుణులు..రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు చెమట వాసన కూడా ప్రత్యేకంగా వస్తుంది. ఆ వాసనను బట్టి కూడా వారిలో శరీరలో డయాబెటిస్ ఉందన్న విషయాన్ని చెప్పేయచ్చు. అయితే డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా వాసన రావాలని లేదు. కొంతమందిలో ఇది జరుగుతుందట.
ప్రతి ఒక్కరికీ ఒక నాచురల్ స్మెల్ ఉంటుంది. ఇది సాధారణంగా మీ చర్మంపై బ్యాక్టీరియా, చెమట మిశ్రమం వల్ల వస్తుంది. అలాగే హార్మోన్లు, ఆహారపు అలవాట్లు, ఇన్‌ఫెక్షన్లు, మందులు వల్ల కూడా కలుగుతుంది. అలాగే మధుమేహం వంటి ఆరోగ్యసమస్యలు అంతర్లీనంగా ఉండడం వల్ల కూడా శరీర వాసన మారుతుందని అంతర్జాతీయ వైద్యులు అంటున్నారు..
డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, శరీర వాసన కాస్త తేడాగా ఉంటుంది. రక్తంలో చక్కెర-సంబంధిత కీటోయాసిడోసిస్‌లు ఉంటాయి, శరీరంలో కీటోన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తం మరింత ఆమ్లంగా మారుతుంది, శరీరం నుంచి తీయటి పండ్ల వాసన వస్తుందట..
డయాబెటిస్ ఉన్నప్పుడు, రక్తంలో చక్కెరను శక్తిగా మార్చడానికి శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉండదు. అప్పుడు కాలేయం కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది, ఆ సమయంలో కీటోన్లు అని పిలిచే ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇలా అధిక స్థాయిలో కీటోన్లు ఉత్పత్తి అయినప్పుడు అవి రక్తం, మూత్రంలో ప్రమాదకరమైన స్థాయికి చేరుతాయి… దీని వల్ల రక్తం ఆమ్లంగా మారుతుంంది. ఈ కీటోన్లు మన శ్వాస, చెమట రూపంలో శరీరం నుంచి బయటికి వెళతాయి. దీని వల్ల శరీరం నుంచి వాసన వస్తుంది. కీటోన్లు అధికంగా బయటికి వెళుతున్నప్పుడు పండ్ల వాసన వస్తుంది. గాలి వదులుతున్నప్పుడు, పీల్చుతున్నప్పుడు కూడా పండ్ల వాసన వస్తుందట..
మొత్తానికి అలా డయబెటీస్ పేషెంట్స్ దగ్గర నుంచి పండ్ల వాసన వస్తుంది.. అయితే ఇది అందరిలో కచ్చితంగా వస్తుందని వైద్యులు చెప్పడం లేదు. కొందరిలో మాత్రమే ఇలా జరుగుతుందట.. ఒకవేళ మీకు తెలిసివారి దగ్గర నుంచి ఎప్పుడు ఇలాంటి వాసన వస్తుంటే.. ఒకసారి డయబెటిక్ టెస్ట్ చేయించుకోమని సూచించండి..!